గడప.. గడప.. ప్రపంచం తెలిసిన మంత్రికి 'ఆసరా' అంటే తెలియదా?

Thu May 12 2022 13:59:25 GMT+0530 (IST)

YSRCP Government and New Cabinet Ministers

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు చిత్ర విచిత్రాలకు పోతున్నారు. ఒక్కొ క్కొ మంత్రిది ఒక్కోశైలి.. అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎవరి శైలి ఎలా ఉన్నా.. కనీసం.. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు. ప్రజలకు ఇస్తున్న సంక్షేమం. ఇలా.. కొన్ని కీలక అంశాలపైనైనా.. పట్టు పెంచుకోవా  లి కదా.. వాటిపై అవగాహన ఉండాలి కదా..?  అంతేకాదు.. రెండు పేజీల మేనిఫెస్టోలో ఉన్న అంశాలను.. కనీసం.. మైండ్‌లోకి ఎక్కించుకోవాలి కదా? అనేది ప్రధాన ప్రశ్న.ఎందుకంటే.. అధికార పార్టీలో ఎమ్మెల్యేల మాట ఎలా ఉన్నా.. మంత్రులకు కూడా సరైన అవగాహన లేక పోవడం.. ఇప్పుడు పార్టీని.. నేతలను కూడాఅభాసు పాలయ్యేలా చేస్తోంది. ప్రస్తుతం.. వైసీపీ వచ్చే ఎన్నిక లపై దృష్టి పెట్టింది. 2024 ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా.. పార్టీ నేతలు పనిచేయాలని.. సీఎం జగన్ ఇప్పటికే నిర్దేశించారు. ఈ క్రమంలోనే ప్రతిష్టాత్మకంగా.. గడపగడప కు ప్రభుత్వం అనే కాన్సెప్టుతో ఒక సంచలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ కార్యక్రమం లక్ష్యం.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను.. ప్రజలకు వివరించడమే. అంటే.. గత మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలను ప్రజలకు మళ్లీ వివరించ డం.. వాటి వల్ల ప్రజలకు ఎలాంటి మేళ్లు వచ్చాయో.. పూసగుచ్చి చెప్పడం ద్వారా.. ప్రబుత్వంపై ఉన్న వ్యతిరేకకతను తగ్గించాలనేది జగన్ వ్యూహం. అయితే.. ఈ విషయంలో నాయకులు.. మంత్రులు  ఈ చిన్న లాజిక్ మిస్సయిపోయారు..

తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏంటి?  ఏయే పథకం కింద ఎవరెవరికి ఎంతెంత లబ్ధి పొందుతున్నారు...వాటి కోసం.. ప్రభుత్వం ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.. అనే విషయంలో చాలా మంది మంత్రులకు అవగాహన లోపం కొట్టొచ్చినట్టు కనిపించింది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు మీడియాముందుకు వచ్చి సుదీర్ఘ ప్రసంగాలతో దంచి కొట్టే మంత్రి అంబటి రాంబాబు ఈ విషయంలో అభాసు పాలయ్యారు.

 'ఆసరా పథకం' అంటే ఏమిటి అంటూ.. మంత్రి అంబటి రాంబాబు వలంటీర్లను అడిగి తెలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మంత్రికే ప్రభుత్వ పథకాలపై అవగాహన లేకపోవడంతో వలంటీర్లు ఒక్కసారిగా కంగుతిన్నారు. బుధవారం పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామంలో జరిగిన 'గడపగడపకు...' కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది.

అంబటి గోళ్లపాడులో ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలను వివరించారు. ఈ క్రమంలో ఆసరా పథకం అందడం లేదని ఒకరు మంత్రి దృష్టికి తెచ్చారు. దీంతో ఆసరా అంటే ఏమిటని అంటూ.. వలంటీర్లను మంత్రి ప్రశ్నించారు. దీంతో వారు మంత్రికి సదరు పథకం గురించి వివరించారు. దీంతో సదరు పథకాన్ని అర్హులైన లబ్ధిదారులకు అందేలా చూడాలని మంత్రి సూచించారు.

ఇదిలావుంటే ప్రభుత్వ పథకాలపై అంబటి పరిజ్ఞానానికి ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. గతంలో పోలవరం ప్రాజెక్టుకు ఉన్న డయాఫ్రం వాల్ అన్ని ప్రాజెక్టులకు ఉంటుందని వ్యాఖ్యానించి నాలుక కరుచుకున్నారు. ఇప్పుడు ఇలా చేశారు. దీంతో ప్రపంచ రాజకీయాలు తెలుసని చెప్పే.. అంబటికి.. ఇలా కనీసం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై కూడా అవగాహనలేకపోవడం.. ఏంటనే పెదవి విరుపు కనిపిస్తంది.