వైసీపీ గోదావరి ఎక్స్ ప్రెస్...జగన్ మార్క్ ఫోకస్

Thu Sep 29 2022 23:59:26 GMT+0530 (India Standard Time)

YSRCP Godavari Express Jagan Mark Focus

ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా లేక దిగిపోవాలన్నా కూడా గోదావరి జిల్లాలది అత్యంత కీలకమైన పాత్ర. ఉమ్మడి ఏపీ నుంచి విభజన ఏపీ దాకా ఇదే రకమైన పరిస్థితి ఉంది. 2014లో చంద్రబాబు సీఎం అయ్యారంటే గోదారి జిల్లాలు జై కొట్టాయి. అవే జిల్లాలు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటే జగన్ 151 సీట్లో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. మొత్తంగా 34 అసెంబ్లీ సీట్లు ఉండే గోదావరి జిల్లాల మీద జగన్ ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా చెబుతున్నారు.ఈ జిల్లాలలో మరోమారు విజయఢంకా మోగించాలని ఆయన కంకణం కట్టుకున్నారు. గోదావరి జిల్లాలో గెలిస్తేనే అందలం ఖాయమని కూడా తెలుసు కాబటే అక్కడ విజయం కోసం ప్రత్యేక ప్రణాళికలతో సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు అని  అంటున్నారు.ఇక చూస్తే గోదావరి జిల్లాలలోని అన్ని నియోజకవర్గాల్లో సంక్షేమ పథకాల అమలు ఏ తీరున సాగుతోంది అలాగే  ఇతర పథకాలతో పాటు పలు అంశాలపై జనాభిప్రాయం ఏమిటి అనంది జగన్ పక్కాగా సమాచారం తెప్పించుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలవలేని సీట్ల మీద కూడా ఈసారి కచ్చితంగా గెలవాలని జగన్ పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తోంది. తూర్పుగోదావరిలోని ఆయా  సీట్లపై కూడా ఆయన ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం అందుతోంది. వీటిలో రాజమండ్రి రూరల్ లో సీనియర్ టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి గెలిచారు. రాజమండ్రి అర్బన్ లో ఆదిరెడ్డి భవానీ గెలిచారు. ఇక మండపేటలో వేగుళ్ల జోగేశ్వరరావు విజయం సాధించారు.

ఈసారి వీటిని వైసీపీ గెలుచుకుని తీరాలని జగన్ భావిస్తున్నారని సమాచారం. రాజమండ్రీలో వైసీపీని పటిష్టం చేసే బాధ్యతలను ఎంపీ మార్గాని భరత్ కి జగన్ అప్పగించారు. అలాగే మండపేటలో వైసీపె జెండా ఎగరేసే బాధ్యతలను రామచంద్రపురం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తోట త్రిమూర్తులుకు అప్పగించారని తెలుస్తోంది.

అంతే కాకుండా గోదావరి జిల్లాల విషయంలో ఎప్పటికపుడు కొత్త ఎత్తులు వేస్తూ జగన్ ముందుకు సాగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ జనసేన బలంగా ఉన్నట్లుగా సర్వేలు వస్తున్నాయి. దాంతో వచ్చే ఎన్నికల్లో ప్రచారానికి వీలు ఉండేలా ఆరు నెలల ముందే అభ్యర్ధులను ప్రకటించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు.

ఇక జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తేనే వైసీపీకి గోదావరి జిల్లాల్లో సామాజికవర్గాల రూపేణా అడ్వాంటేజ్ ఉంటుందని కూడా జగన్ భావిస్తున్నారా అంటే అవును అనే అంటున్నారు. సామాజికపరమైన లెక్కలతోనే ఆయన ఈ విధంగా ఆలోచిస్తున్నారు అని తెలుసోంది. 2019 ఎన్నికల్లో తాను నమ్ముకున్న సోషల్ ఇంజనీరింగ్ నే గోదావరి జిల్లలలో మరోసారి అమలు చేయడం ద్వారా టోటల్ సీట్లు గెలవాలని జగన్ చూస్తున్నారు అని అంటున్నారు.

ఒక విధంగా చెప్పాలంటే కాపుల మద్దతు ఎంత దక్కినా బీసీలను మరో వైపు దువ్వాలని ఆ విధంగా తన వైపు బలమైన సామాజికవర్గాలను తిప్పుకుని వచ్చే ఎన్నికల్లో పాగా వేయలని జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఇక గోదావరి జిల్లాల ప్రత్యేక పధకం అంటూ జగన్ మార్క్ పాలిటిక్స్ భవిష్యత్తులో సాగుతుంది అంటున్నారు. ఎవరూ ఊహించనై ఆశ్చర్యకరమైన పధకలేఅ గోదావరి జిల్లాల కోసం ఫ్యూచర్ లో ముందుకు రాబోతున్నాయని అంటున్నారు. సో వైసీపీ పొలిటికల్ గోదావరి ఎక్స్ ప్రెస్ అన్నది ఇపుడు ఆసక్తికరంగానే కాదు చర్చనీయాశంగా ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.