పెండింగ్ లో వైసీపీ అభ్యర్థి నామినేషన్

Tue Mar 26 2019 16:31:58 GMT+0530 (IST)

YSRCP Cnadidate Nomination Is Pending

ఎన్నికల వేళ చిన్న లూప్ హోల్ దొరికితే చాలు.. ఆ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించడానికి అధికారులు కాచుకు కూర్చుంటున్నారు. తాజాగా వైసీపీ అభ్యర్థి నామినేషన్ లో దొరికిన చిన్న తప్పుతో ఆయన అభ్యర్థిత్వంపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. వైసీపీ అభ్యర్థి నామినేషన్ ఆమోదిస్తారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది..తాజాగా రాజమండ్రి సమీపంలోని మండపేట వైసీపీ అభ్యర్థి పిల్లి సుభాష్ చంద్రబోస్ నామినేషన్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వరరావు పెండింగ్ లో పెట్టారు. మాజీ ఎమ్మెల్యే అయిన పిల్లి సుభాష్ చంద్రబోస్ తను తీసుకుంటున్న పింఛన్ వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో నమోదు చేయలేదు. దీంతో ఈ విషయంపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు.

ఎన్నికల అధికారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రస్తుతానికి పిల్లి సుభాష్ చంద్రబాబు నామినేషన్ ను పెండింగ్ లో పెట్టారు.  ఆయన అభ్యర్థిత్వాన్ని ఆమోదిస్తారా.? లేక తిరస్కారా అన్నది సస్పెన్స్ గా మారింది. తిరస్కరిస్తే మాత్రం వైసీపీకి మండపేటలో తీవ్ర దెబ్బగా భావిస్తున్నారు.