అనుకున్నది సాధించారుగా.. కేంద్రంలో జగన్ సక్సెస్

Mon Nov 29 2021 05:00:01 GMT+0530 (IST)

YS Jagan Success at the Center

ఏపీ ముఖ్యమంత్రి జగన్.. అనుకున్నది సాధించారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించారు.  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న డా.సమీర్ శర్మ పదవీ కాలాన్ని పొడిగింప చేసుకున్నారు. జగన్ మోహన్‌రెడ్డి రాసిన లేఖకు కేంద్రం సానుకూలంగా రియాక్ట్ అయింది. కేంద్ర ప్రభుత్వం మరో ఆరు మాసాలు అనగా డిసెంబరు 1వ తేదీ నుండి 2022 మే 31 వరకూ పొడిగించింది. దీంతో జగన్‌కు అత్యంత సన్నిహిత అధికారిగా.. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సాయం చేస్తున్న అధికారిగా.. పేరున్న సమీర్ శర్మ వచ్చే ఏడాది వరకు కొనసాగనున్నారు.1985వ ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన సమీర్ శర్మ ఈ నెల 30న పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే.. ఆయన సేవలకు ఫిదా అవుతున్న సీఎం జగన్.. కొన్నాళ్లపాటు ఆయనను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే  జగన్మోహన్ రెడ్డి సిఎస్ పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించాల్సిందిగా ఈ నెల 2న కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు సిఎస్ పదవీకాలాన్ని మరో ఆరు మాసాలు పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది. దీంతో జగన్ కేంద్రం వద్ద సక్సెస్ అయినట్టు అయింది.

ఈ మేరకు తాజాగా కేంద్ర ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాల శాఖ (డిఓపిటి) అండర్ సెక్రటరీ కులదీప్ చౌదరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఆదేశాలు జారీ చేశారు.అయితే. గతంలోనూ .. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీలం సాహ్ని విషయంలోనూ ముఖ్యమంత్రి ఇలానే.. పట్టుబట్టి.. ఆరు మాసాలు పొడిగించుకున్నారు. అయితే.. ఇంతకుముందు పనిచేసిన.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విషయంలో మాత్రం జగన్ లేఖ రాయకపోవడం.. గమనార్హం. సమీర్ శర్మకు ముందు.. జవహర్‌రెడ్డి సీఎస్గా ఉన్నారు. అయితే.. ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని జగన్ కోరలేదు. దీనికి కారణం.. తన సామాజిక వర్గానికి చెందిన అధికారి అయి ఉంటుందని.. అప్పట్లో ప్రచారం జరిగింది. కాగా.. ఇప్పుడు మాత్రం ఆయన సమీర్ శర్మను పొడిగించుకున్నారు.