Begin typing your search above and press return to search.

ఆ జిల్లా మ‌న‌వ‌డిగా అండ‌గా ఉంటాన‌న్న జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   10 Oct 2019 12:10 PM GMT
ఆ జిల్లా మ‌న‌వ‌డిగా అండ‌గా ఉంటాన‌న్న జ‌గ‌న్‌
X
నేను ఏపీకీ సీఎంనే కానీ అంత‌క‌న్నా ముందు నేను మీ జిల్లా మ‌న‌వ‌డిని... మా అమ్మ విజ‌య‌మ్మ మీ జిల్లా ఆడ‌బిడ్డ‌.. నేను మీ మ‌న‌వడిని.. మీ మ‌న‌వ‌డిగా మీ జిల్లాకు వ‌చ్చాను.. మీకు అండ‌గా ఉంటాను.. మీ జిల్లా రూపురేఖ‌లు మార్చుతాను.. అంతే కాదు.. మీ స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని ప‌రిష్క‌రిస్తా.. అంటూ ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోహ‌న్‌ రెడ్డి సెంటిమెంట్‌ తో ప్ర‌జ‌ల‌ను క‌ట్టిపడేశారు. సీఎం జ‌గ‌న్ అనంత‌పురంలో వైఎస్సార్ కంటివెలుగు ప‌థ‌కంను లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన స‌భ‌లో సీఎం జ‌గ‌న్ చేసిన ప్ర‌సంగం అంద‌రిని ఆక‌ట్టుకుంది. అంతే కాదు సెంటిమెంట్‌ తో అంద‌రిని క‌ట్టిప‌డేశారు.

అనంత జిల్లాపై వ‌రాల జ‌ల్లు కురిపించారు. అనంతపురంను ఆనంద పురంగా మార్చుతాన‌నే విధంగా హామీ ఇచ్చి జ‌గ‌న్ సెంటిమెంట్‌ ను కుమ్మ‌రించారు.. ఆనాడు స్వ‌ర్గీయ మా తండ్రి వైఎస్సార్ ప‌రిపాల‌న కాలంలో అనంత‌పురంలో వాన‌లు కురిసాయి.. ఆనాడు నిండిన చెరువులు - కుంట‌లు - పారిన న‌దులు - వాగులు - వంక‌లు.. త‌రువాత వాన‌ల జాడే లేదు.. అనంత‌పురం ఆక‌లి జిల్లాగా మారింది. మ‌ళ్ళీ ఇంత కాలానికి దేవుడు క‌రుణించారు.. జోరుగా వాన‌లు కురిపించాడు.. చెరువులు - కుంటలు పూర్తిగా నిండిపోయాయి.. ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది.. ఆనాడు నాన్న కాలం - ఈనాడు నా కాలం వ‌రుణుడు కరుణించాడు.. అంటూ వ‌రుణుడికి వంద‌నాలు తెలిపారు సీఎం జ‌గ‌న్‌.

ఇంకా త‌న ప్ర‌సంగంలో నేను మీ జిల్లా మ‌న‌వ‌డిగా మాటిస్తున్నాను.. మీ అంద‌రి క‌ష్టాలు సాధ్య‌మైనంత మేర‌కు తీర్చుతాన‌ని మాటిచ్చారు. అనంత‌పురంలో సాగునీటికి త‌గిన ప్రాధాన్య‌త ఇస్తాన‌ని హ‌మీ ఇచ్చారు. సీఎం జ‌గ‌న్ మీ మ‌న‌వ‌డిని - మీ జిల్లా ఆడ‌బిడ్డ కొడుకును అన్నప్పుడు జిల్లా ప్ర‌జ‌ల నుంచి - నేత‌ల నుంచి భారీ స్పంద‌న వ‌చ్చింది. ఏదేమైనా జ‌గ‌న్ ఓ వైపు ప‌రిపాల‌న‌లో త‌న‌దైన మార్క్ చూపిస్తూనే మ‌రోవైపు త‌న కుటుంబ నేప‌థ్యం - ఏ ప్రాంతానికి వెళితే అక్క‌డ ప్ర‌జ‌ల‌తో ఉండే సంబంధాల‌ను గుర్తు చేసుకుంటూ అంద‌రిని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మొత్తానికి జ‌గ‌న్ ప్ర‌జ‌లంద‌రిని త‌న మాట‌ల‌తోనూ - చేత‌ల‌తోనూ - ప‌రిపాల‌న‌తోనూ మంత్ర‌ముగ్థుల‌ను చేస్తున్నారు.. ఏమైనా రాజ‌న్న బిడ్డ‌గా జ‌గ‌న్‌ కే అది సాధ్య‌మ‌నే మాట‌లు వినిపిస్తున్నాయి...