టైం చెప్పు తాగుబోతు.. నర్సీపట్నం వస్తా.. సాయిరెడ్డి కాంట్రవర్సీ ట్వీట్

Sat Jun 25 2022 19:48:00 GMT+0530 (IST)

YCP vijaysaireddy tweet on ayyanna patrudu

రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం. పోనీ.. గల్లీ స్థాయినేతల పరిస్థితి పక్కన పెట్టినా.. ఆయా నేతల స్థాయి ని బట్టి అయినా..నాయకులు హుందా గా వ్యవహరించాలి. కానీ.. ఏపీ అధికార పార్టీలో కీలక నాయ కుడిగా చక్రం తిప్పుతు.. ఎంపీ.. సాయిరెడ్డి మాత్రం పక్కా ఊరమాసు నేతకన్నా ఘోరంగా వ్యవహరిస్తు న్నారు.నాయకులు ఎవరైనా.. ఆయన నోటి దూల మాత్రం ఆగడం లేదు. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై.. విగ్గు రాజు... పెగ్గు రాజు.. అని విరుచుకుపడే ఆయన.. కుసంస్కారానికి నెటిజన్లు కూడా చురకలు అంటిస్తున్నారు.

ఇక ఇటీవల కాలంలో టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిపై సాయిరెడ్డి తీవ్ర విమర్శల చేస్తున్నారు. అయ్యన్నను టార్గెట్‌గా పెట్టుకుని.. పిల్లి.. తాగుబోతు.. అంటూ సాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. దీంతో ఇది వివాదంగా మారింది. అయ్యన్న రాజకీయంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సాయిరెడ్డి.. అయ్యన్నపై వ్యక్తిగతంగా విరుచుకుపడడం గమనార్హం. దీనికి అయ్యన్న కూడా అదే రేంజ్‌లో ఎదురు దాడిచేశారు. ఎక్కడా తగ్గేదేలే! అంటూ.. ఆయన  కూడా ఆన్సర్ చేశారు.

ఇంతకీ సాయిరెడ్డి ఏమన్నారంటే.. ``పిల్లి తనను ఎవరు వేటాడతారా? అని ఎప్పుడూ.. భయపడుతూనే ఉంటుంది. కానీ పులి కన్నా.. గొప్పదానన్ని తనకు తానే అనుకుంటుంది. నేను ననర్సీపట్నం వస్తా.. డేట్. టైం చెప్పు తాగుబోతు. అయినా.. నువ్వు అజ్ఞాతంలో కి పోయావట కదా! పారిపోకుండా నిలబడు గంజాయి`` అని ట్వీట్ చేశారు.

దీనికి అయ్యన్న ఘాటునే స్పందించారు. ``16 నెలలు చిప్పకూడు తినడం వల్ల శరీరం మందపడింది. తోటి ఖైదీలు ఖాకీల చేతిలో తిన్న దెబ్బల వలన ఏర్పడ్డ చారలు చూసుకుని.. విజయసాయిరెడ్డి పులిగా ఫీల్ అవడంలో తప్పులేదు. బెయిల్ కోసం. ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానికి ఢిల్లీ వెళ్లిన నువ్వునన్ను అజ్ఞాతంలో ఉన్నాననడం విడ్డూరంగా ఉంది!`` అని వ్యాఖ్యానించారు.

దీనికి కొనసాగింపుగా.. ``అంత గొప్పగా ఉంది నీ సమాచార వ్యవస్థ. నేను నర్సీపట్నంలోనే ఉన్నా. ముహూర్తం ఎందుకునువ్వు ఎప్పుడొచ్చినా.. నేను రెఢీ. అన్నట్టు పులి అయితే.. పోలీసులను వేసుకుని రాదుగా.. సింగిల్‌గా రావాలి. అప్పుడు తేలిపోద్ది ఎవడు పులో.. ఎవడు పిల్లో!! `` అని పేర్కొన్నారు. మొత్తానికి ఈ ఇద్దరు నేతల ట్వీట్‌లపై నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.