ఎంపీ రఘురామకు జగన్ మరో షాక్

Sun Jun 13 2021 11:01:23 GMT+0530 (IST)

YCP removed the name of Raghurama Raju

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సీఎం జగన్ షాకిచ్చారు. వైసీపీ నుంచి గెలిచి సీఎం జగన్ కు కొరకరాని కొయ్యగా మారి తీవ్ర విమర్శలు చేస్తున్న ఎంపీ రఘురామను ఇక ఉపేక్షించేది లేదని జగన్ డిసైడ్ అయినట్టు ఉన్నాడు.సీఎం జగన్ పై వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ఎంపీ రఘురామ పేరును వైసీపీ అధికార వెబ్ సైట్ లో తొలగించారు. ఆ పార్టీ ఎంపీల జాబితా నుంచి రఘురామకృష్ణంరాజు పేరును తొలగించారు.

రాజ్యసభ లోక్ సభబ కలిపి ఆ పార్టీ తరుఫున 28 మంది పార్లమెంట్ సభ్యుల పేర్లను గతంలో పొందుపరిచారు. ఇటీవల తిరుపతి నుంచి విజయం సాధించిన డాక్టర్ గురుమూర్తి పేరును ఎంపీల జాబితాలో చేర్చారు. అయితే రఘురామ పేరు మాత్రం సవరించిన జాబితాలో లేదు. దీనిపై అధికార పార్టీ నేతలు ఇంతవరకు స్పందించలేదు.

ఇక వైసీపీ అధికార వెబ్ సైట్ లో తన పేరు లేకపోవడంపై రఘురామ స్పందించారు. ‘ఈరోజు మా పార్టీ అధ్యక్షుడు నన్ను పార్టీ నుంచి బహిష్కరించారా? ’ అని ప్రశ్నించారు. తన పార్లమెంట్ సభ్యత్వ అనర్హత అంశం తలెత్తబోదని ధీమా వ్యక్తం చేశారు.