విపక్షాలకు భయపడుతున్న వైసీపీ మంత్రులు.. నిజమేనా?

Wed Jun 29 2022 08:29:27 GMT+0530 (IST)

YCP ministers fearing opposition .. Really?

వైసీపీ సర్కారులోని చాలా మంది మంత్రులు మీడియా ముందుకు కూడా రావడం లేదు. కొత్తగా వచ్చిన వారు.. మరోసారి అధికారం దక్కించుకున్నవారు కూడా ఇలానే వ్యవహరిస్తున్నారు. నిజానికి ప్రతిపక్షాల దూకుడు పెరిగింది. ముఖ్యమంత్రి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. శాఖలను పక్కన పెట్టినా.. ముఖ్యమంత్రిని మాత్రం ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. అమ్మ ఒడికి సంబంధించి కానీ.. సంక్షేమానికి సంబంధించి కానీ.. ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి.అయితే.. వీటిని సమర్ధంగా తిప్పికొట్టే మంత్రులు కనిపించడం లేదు. దీనికి కారణం .. వారు భయపడు తున్నారనే భావన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. 'వాళ్లు ఒకటంటారు.. నేనొకటంటాను.. ఎందుకీ రచ్చ' అని చాలా మంది మంత్రులు అంటున్నారు.

మరికొందరు ఇది కూడా అనడం లేదు. అసలు మీడియా ముందుకు రాని మంత్రులు కూడా ఉన్నారు. వీరిలో గుమ్మనూరు జయరాం ముందువరుసలో ఉన్నారు. అప్పట్లో ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత.. ఆయన సైలెంట్ అయిపోయారు.

అదే విధంగా బూడి ముత్యాలనాయుడు కూడా వాయిస్ వినిపించడం లేదు. ఆయనపై ఆరోపణలు లేకున్నా.. ఈ తలనొప్పి నాకెందుకు అనే టైపులో వ్యవహరిస్తున్నారు. ఇక కారుమూరి నాగేశ్వరరావు ఒకింత దూకుడుగా ఉన్నా.. ఆయన నోరు అదుపులో పెట్టుకోలేక పోతున్నారు.

వైసీపీ మాజీ మంత్రులనే ఆయన విమర్శిస్తున్నారు. దీంతో ఆయన వల్ల పార్టీకి ప్రయోజనం లేకపోగా.. సమస్యలు పెరుగుతు న్నాయి. మరోవైపు మహిళా మంత్రులు కూడా దూకుడు ప్రదర్శించడం లేదు.

గతంలో ఉన్న ముగ్గురు స్థానంలో ఇద్దరిని పక్కన పెట్టి విడదల రజనీ ఉషశ్రీచరణ్. రోజాను జగన్ కేబినె ట్‌లోకి తీసుకున్నారు. ఇక వనితను కంటిన్యూ చేస్తున్నారు. అయితే.. వీరు కూడా ఎక్కడా పెదవి విప్పడం లేదు. రోజా మాట్లాడినా.. తాను మంత్రిని అన్న సంగతి మరిచిపోతున్నారనే విమర్శలు వున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ 2.0 ఆశించిన విధంగా పార్టీకి మేలు చేయడం లేదనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుండడం గమనార్హం.