ఉత్తరాంధ్ర : వైసీపీ నేతలు టీడీపీ చూపు ?

Wed Jun 29 2022 19:00:01 GMT+0530 (IST)

YCP leaders show TDP?

ఆంధ్రావని వాకిట అధికార పార్టీ కి చెందిన కొందరు నేతలు టీడీపీ వైపు వెళ్లిపోదాం అని అనుకుంటున్నారు. ఓ విధంగా ఇది ఎప్పట్నుంచో వింటున్న మాటే ! కొన్ని సమీకరణాల కారణంగా ఆగి ఉండవచ్చు. లేదా కొన్ని బుజ్జగింపుల కారణంగా ఆగి ఉండవచ్చు.ఆ విధంగా పక్క పార్టీ వైపు చూపులు పక్క పార్టీతో మాటలు ఆగిపోయి ఉండవచ్చు. ఉత్తరాంధ్రలో బాబు కోరుకున్న విధంగా పట్టు రావాలంటే కొందరు మాజీలు అలానే జగన్ ను ఫక్తుగా వ్యతిరేకించే వారు ఇటుగా రావాలి. ఆ విధంగా వస్తేనే టీడీపీకి మేలు జరిగే వీలుంది. ఇప్పటికిప్పుడు టీడీపీ వైపు చూసే నాయకులులో కొత్తగా కృపారాణి పేరు వినిపిస్తోంది.

మాజీ కేంద్ర మంత్రిగా పేరున్న నేతగా ఉన్న ఈమె ఇప్పుడు టీడీపీ వైపు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారని వార్తలు వస్తున్నాయి. పార్టీలో అంతర్గత విభేదాలు తన ఉనికికి అడ్డం పడుతున్నాయని ఆమె భావిస్తున్నారు. ఒకవేళ ఇటుగా వస్తే ఆమెకు ఏ నియోజకవర్గం కేటాయిస్తారు అన్న వాదన కూడా ఉంది.

శ్రీకాకుళం పార్లమెంట్ కు కింజరాపు రామ్మోహన్ నాయుడే పోటీ చేస్తారు.  కనుక అక్కడ ఛాన్స్ లేదు. అసెంబ్లీ పరిధిలో టెక్కలి కానీ నర్సనపేట కానీ ఛాన్సే లేదు. ఒకవేళ వీలుంటే ధర్మానకు పోటీగా కృపారాణి శ్రీకాకుళం నియోజకవర్గంలో పోటీ చేసే వీలుంది.

ఇక్కడ ఇంతవరకూ కాళింగులు గెలిచిన దాఖలాలు లేకపోయినా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు నిలువరించేందుకు కొత్త ముఖం తెరపైకి తీసుకువచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఆ విధంగా గుండ కుటుంబాన్ని కాదనుకుని కిల్లి కృపారాణికి ఇచ్చే ఛాన్స్ ఉంది.

అదేవిధంగా నర్సన్నపేటలో కూడా కొంత వరకూ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా కొత్త ముఖం బరిలో దిగేందుకు వీలుంది. కానీ ఇప్పటి పరిణామాల మేరకు సాధ్యం కాకపోయినా రేపటి వేళ ఏమయినా జరగవచ్చు.