Begin typing your search above and press return to search.

శంషాబాద్ లో 30 ఎక‌రాలు కొన్న వైసీపీ ఎంపీ ఎవ‌రు?

By:  Tupaki Desk   |   19 Jan 2022 1:31 PM GMT
శంషాబాద్ లో 30 ఎక‌రాలు కొన్న వైసీపీ ఎంపీ ఎవ‌రు?
X
షంషాబాద్! హైద‌రాబాద్‌లో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ఉన్న అత్యంత ఖ‌రీదైన ప్రాంతం. ఇక్క‌డ ఒక్క‌ అంగుళం భూమి కొనాలంటేనే ఇప్పుడున్న మార్కెట్ ధ‌ర‌ల ప్ర‌కారం కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చ‌వుతుం ద‌నే అంచ‌నాలు వున్నాయి. పైగా డిమాండ్ ఆకాశం అంత ఎత్తు ఉంది. ఎందుకంటే.. రాబోయే రోజుల్లో ఇక్క‌డ అనేక ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ‌లు రానున్నాయి. దీంతో ఈ ప్రాంతానికి డిమాండ్ పెరిగిపోయింది. అలాంటి అత్యంత ఖ‌రీదైన ప్రాంతంలో ఏపీలోని అధికార పార్టీ వైసీపీకి చెందిన ఎంపీ ఒక‌రు స్థ‌లాలు కొన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

అంతేకాదు.. ఇలా కొన్న‌ది ఒక గ‌జ‌మో.. రెండు గ‌జాలో కాదు..ఏకంగా 30 ఎక‌రాలు కొన్నార‌ని పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల‌లోనే ప్రచారం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ముందు.. రియ‌ల్ ఎస్టేట్ వ‌ర్గాల్లో ప్రారంభ‌మైన ఈ చ‌ర్చ‌.. చివ‌ర‌కు పొలిటిక‌ల్ స‌ర్కిళ్ల వ‌ర‌కు వ‌చ్చింది. స్థానికంగా ఈ విష‌యం పెద్ద ఎత్తున చ‌ర్చ గా మారింది. అంతేకాదు.. ఈ ఎంపీ కొనుగోలు చేసిన‌.. 30 ఎక‌రాల‌కు ప‌క్క‌న‌.. మ‌రో 18 ఎక‌రాల స్థ‌లం ఉంది. దీనిని కూడా కొనేయాల‌ని స‌దరు ఎంపీ ప్లాన్ చేస్తున్నారు. అయితే.. ఈ స్థ‌లం ఉన్న‌వారు.. అమ్మేది లేద‌ని చెబుతున్నారు.

దీంతో ఆయ‌న ఈ విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నార‌ని అంటున్నారు రియ‌ల్ ఎస్టేట్ వ‌ర్గాలు. నిజానికి షంషాబాద్ చుట్టుప‌క్క‌ల ఏరియాల్లో ప్ర‌భుత్వం అనేక అభివృద్ధి ప‌నులు చేప‌ట్టింది. ముఖ్యంగా కొత్త‌గా వ‌చ్చే ప‌రిశ్ర‌మ‌లు.. ఐటీ కంపెనీల‌ను ఇక్క‌డ ఏర్పాటు చేయాల‌ని చూస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఏపీకి చెందిన కీల‌క ఎంపీ ఒక‌రు ముందు చూపుతో ఇక్క‌డ స్థ‌లం కొన్నార‌నే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. ఈ స్థ‌లంలో ఆయ‌న హైఫై స్థాయిలో విల్లాలు క‌ట్టాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. దీంతో ఈ విష‌యం .. రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అయితే.. స‌ద‌రు ఎంపీ ద‌గ్గ‌ర ఇంత డ‌బ్బు ఎలా వ‌చ్చింద‌నే చ‌ర్చ పెరుగుతుండ‌డం గ‌మ‌నార్హం. క‌రోనా నేప‌థ్యంలో అన్ని వ‌ర్గాలు దెబ్బ‌తిన్నాయి. కానీ, ఎంపీ మాత్రం ఈ క‌రోనా స‌మ‌యంలోనే ఇంత పెద్ద ఎత్తున డ‌బ్బులు ఎక్క‌డ పోగు చేశార‌నే చ‌ర్చ సాగుతోంది. దీనిని బ‌ట్టి.. స‌ద‌రు ఎంపీ నిజంగానే అక్క‌డ కొన్నారా.. లేక‌..పొలిటిక‌ల్ డిబేట్‌లో మైలేజీ కోసం..అలా ప్ర‌చారం చేయించుకుంటున్నారా? అనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఒక‌వేళ ఆయ‌న నిజంగానే కొంటే.. అది పార్టీ అధిష్టానానికి తెలిసే జ‌రిగిందా? అనేది కూడా చ‌ర్చ‌గా మారింది. మ‌రి చూడాలి ఏం జ‌రుగుతుందో.