Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేల‌కు షాకిచ్చేందుకు వైసీపీ ఎంపీ అదిరిపోయే స్కెచ్‌

By:  Tupaki Desk   |   21 Nov 2020 5:15 AM GMT
ఎమ్మెల్యేల‌కు షాకిచ్చేందుకు వైసీపీ ఎంపీ అదిరిపోయే స్కెచ్‌
X
రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేని ప‌రిస్థితి. వ్యూహ ప్ర‌తివ్యూహాలు, ఎత్తులు-పైఎత్తులు లేని రాజ‌కీయాల‌ను ఊహించ‌లేం. సో.. ఇప్పుడు గుంటూరు జిల్లాలోనూ ఇలాంటి ఎత్తులు.. పైఎత్తులు.. వ్యూహ ప్ర‌తివ్యూహాల‌తో కూడిన రాజ‌కీయాలు సాగుతున్నాయి. ఈ జిల్లాలోని రెండు ఎంపీ సీట్ల‌ను వైసీపీ కైవ‌సం చేసుకుంది. అయితే.. ఈ ఇద్ద‌రు ఎంపీల‌కు.. వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిధిలోని అసెంబ్లీ స్థానాల ఎమ్మెల్యేల‌తో స‌ఖ్య‌త లేదు. ఈ క్ర‌మంలోనే అనేక వివాదాలు.. విభేదాలు కూడా తెర‌మీద‌కి వ‌చ్చాయి.. వ‌స్తున్నాయి. ఈ వివాదాల సుడిలో దాదాపు ఎమ్మెల్యేదే పైచేయిగా కొన‌సాగుతోంది.

దీంతో ఎంపీలు కూడా త‌మ‌కు ఎప్పుడు అవ‌కాశం వ‌స్తుందా? అని ఎదురు చూస్తున్నారు. ఇక‌, ఈ ఇద్ద‌రు ఎంపీల్లోనూ న‌ర‌స‌రావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయులు స్ట‌యిల్ మ‌రింత డిఫ‌రెంట్‌. ఆదిలో అంద‌రు ఎమ్మెల్యేలతో ఆయ‌న‌ క‌లిసి మెలిసి ముందుకు సాగేవారు. అయితే.. ఏమైందో ఏమో.. న‌ర‌స‌రావుపేట పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోకి వ‌చ్చే చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జ‌నీకి లావుకు మ‌ధ్య ఆధిప‌త్య రాజ‌కీయాలు తెర‌మీదికి వ‌చ్చాయి. తీవ్ర వివాదాలు సాగాయి. ఒక‌రికొక‌రు రోడ్డున కూడా ప‌డ్డారు. దాడులు చేసుకున్నారు.

మ‌రోవైపు.. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు కూడా ఎంపీ లావును ఖాత‌రు చేయడం లేదు. తానే సీనియర్ న‌ని ఆయ‌న దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. మాచ‌ర్ల ఎమ్మెల్యే సీనియ‌ర్ నాయ‌కుడు పిన్నెల్లి రామ ‌కృష్ణారెడ్డి కూడా ఎంపీని పెద్ద‌గా లెక్క‌చేయ‌డం లేద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో త‌న గ్రాఫ్ త‌గ్గుతోంద‌ని ఎంపీ భావిస్తున్నారు. పోనీ.. త‌నే స్వ‌యంగా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టో.. నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించి ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునో.. దూసుకు పోదామంటే.. అది కూడా ఎమ్మెల్యేల‌కు ఇష్టం ఉన్న ‌ట్టు క‌నిపించ‌డం లేదు. దీంతో కొన్నాళ్లు మౌనంగా ఉన్నారు.

మ‌రి ఎమ్మెల్యేలు త‌న మాట వినేది ఎప్పుడు? త‌న రేంజ్ పెరిగేది ఎప్పుడు? అనే ప్ర‌శ్న‌లు ఎంపీని వేధిస్తూ నే ఉన్నాయి. ఇంత‌లో జిల్లాల ఏర్పాటు ఆయ‌న‌కు క‌లిసి వ‌చ్చింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. న‌ర‌స‌రా వుపేట జిల్లాను ఏర్పాటు చేయ‌డంలో ఎంపీ పాత్రే కీల‌కం. దేనిని జిల్లా కేంద్రంగా ఉంచాలి? అనేది ఎంపీ నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలోనే నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప‌ల్నాడు కేంద్రంగా న‌ర‌స‌రా వుపేట జిల్లాకు ఎంపీ మొగ్గు చూపారు. అయితే, త‌న పార్టీ ఎమ్మెల్యేలు త‌నకు దూరంగా ఉండ‌డం, త‌న‌ను లెక్క చేయ‌క‌పోవ‌డంతో.. గుర‌జాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాల‌నే డిమాండ్‌ను ఎత్తుకున్న టీడీపీ నాయ‌కుల‌కు లోపాయికారీ.. లావు స‌హ‌క‌రిస్తున్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.

తద్వారా.. ఎమ్మెల్యేల‌ను దారిలో తెచ్చుకునేందుకు.. ఆయ‌న ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎలాగంటే.. పేట జిల్లా విష‌యంలో మార్పులు, చేర్పులు చేసే అధికారం లావుకు ఉంది క‌నుక‌.. గుర‌జాలపై ఎమ్మెల్యేలు.. త‌మ అభిప్రాయాల‌ను ఎంపీకే చెప్పాల్సి ఉంటుంది. దీంతో అప్ప‌టికైనా.. ఎంపీని వాళ్లు గౌర‌వించాల్సిందే! ఆ యన ద‌గ్గ‌ర‌కు వెళ్లాల్సిందే. ఇదే వ్యూహంతో కృష్ణ‌దేవ‌రాయులు ముందుకు సాగుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి రాయులు ఏమేర‌కు స‌క్సెస్ అవుతారో చూడాలి.