Begin typing your search above and press return to search.

మంత్రులు - వైసీపీ ఎమ్మెల్యేలు ఆంధ్రజ్యోతికి కోట్లలో బిజినెస్ ఇచ్చారా? ఏందీ కథ

By:  Tupaki Desk   |   21 Sep 2020 2:30 PM GMT
మంత్రులు - వైసీపీ ఎమ్మెల్యేలు ఆంధ్రజ్యోతికి కోట్లలో బిజినెస్ ఇచ్చారా? ఏందీ కథ
X
అధికారంలో ఉండి పారదర్శకంగా నీ పని నువ్వు చేసుకుంటే ఏవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. అదే అవినీతికి పాల్పడితేనో.. లేక ఏదైనా లూప్ హోల్స్ ఉంటేనో పత్రికలకు.. ప్రత్యర్థులకు భయపడుతారు. అది సహజంగా రాజకీయాల్లో.. సమాజంలో జరుగుతుండేదే.. కానీ ఇప్పుడు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తమ వైరి పత్రికకు భయపడి కోట్లలో యాడ్స్ కుమ్మరించేస్తున్నారన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.

ఏపీలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు టీడీపీ అనుబంధ పత్రిక అయిన ఆంధ్రజ్యోతికి కోట్లల్లో బిజినెస్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది. ప్రత్యర్థి పార్టీ పత్రికకు ఎందుకు ఇంతలా ఇచ్చారనే దానిపై రాజకీయవర్గాల్లో ఒకటే గుసగుసలు వినిపిస్తున్నాయి.

అసలు విషయానికి వస్తే.. ‘ఆంధ్రజ్యోతి 18వ వార్షికోత్సవం సందర్భంగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ల అనుచరుల చేత పెద్ద ఎత్తున ఆ పత్రికకు ప్రకటనలు ఇస్తున్నారట.. రాష్ట్రం మొత్తం మీద టీడీపీ వాళ్లు ఆ పత్రికకు 2శాతం కూడా ప్రకటనలు ఇవ్వలేదంట.. కానీ అధికార వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. వాళ్ల అనుచరులు మాత్రం పోటీపడి యాడ్స్ ఇస్తున్నారంట.. వైసీపీ వాళ్లకు ఆంధ్రజ్యోతి అంటే ఎంత భయమో దీన్ని బట్టి తెలుస్తోందని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. ఎందుకు ఇంతగా ఆ పత్రికకు యాడ్స్ ఇస్తున్నారనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది.

మంత్రులు, ఎమ్మెల్యేలు డైరెక్ట్ గా వాళ్ల పేరు మీద కాకుండా వాళ్ల అనుచరుల పేరు మీద యాడ్స్ ఇస్తున్నారట.. 2014 ఎన్నికల తరువాత వైసీపీ పార్టీ అధికారికంగా ఒక సర్క్యూలర్ జారీ చేసిందట.. ఆంధ్రజ్యోతికి ఎటువంటి యాడ్స్ ఇవ్వవద్దు అని ఈ మేరకు పార్టీ శ్రేణులందరికీ అల్టిమేటం జారీ చేసిందట.. అప్పుడు ప్రతిపక్షంలో వైసీపీ ఉండడం.. పెద్దగా ఆర్థిక వనరులు.. అలిగేషన్స్ లేకపోవడంతో అప్పుడు వైసీపీ నేతలు ఎవరూ ఆ పత్రికకు యాడ్స్ ఇవ్వలేదట..

ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది. సవాలక్ష అలిగేషన్స్.. అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలు ఆంధ్రజ్యోతికి భయపడి పెద్ద ఎత్తున యాడ్స్ ఇస్తున్నారట.. ఆ పత్రికకు కోట్లలో బిజినెస్ ఇస్తున్నారని ఇంటెలిజెన్స్ వాళ్లు వైసీపీ హైకమాండ్ కు రిపోర్ట్ ఇచ్చారని తాడేపల్లిలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.