వామ్మో ఉండవల్లి శ్రీదేవి.. లీకైన ఆడియో టేప్

Sat Sep 19 2020 09:30:38 GMT+0530 (IST)

YCP MLA Sridevi Warning to CI

అధికారం చేతిలో ఉన్నప్పుడు ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించాల్సిన రోజులు పోయాయి. చేతిలోని అధికారంతో చెలరేగిపోయే అధికారపక్ష నేతల మాటలు ఎలా ఉంటాయన్న విషయాన్ని తెలియజేసే ఆడియో టేప్ ఒకటి బయటకు వచ్చి కలకలం రేపుతోంది. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వాహనాల్ని పట్టుకున్న పోలీసు అధికారికి తలంటటమే కాదు.. సీరియస్ వార్నింగ్ ఇవ్వటం హాట్ టాపిక్ గా మారింది.బాధ్యత కలిగిన పోలీసు అధికారిని పట్టుకొని ఏరా అంటూ సంభోదించటమే కాదు.. నా కాళ్లు పట్టుకొని పోస్టింగ్ తెచ్చుకున్నావ్.. ఎక్స్ ట్రాలు చేయొద్దని తేల్చేశారు. ఎమ్మెల్యే చెబుతున్నా వినవా. ఎస్పీతో మాట్లాడాలా? డీజీపీతో మాట్లాడాలా చెప్పు అంటూ హడావుడి చేసిన ఆమె.. సీఐ చెబుతున్న సాంకేతిక అంశాల్ని పట్టించుకోకుండా నిప్పులు చెరగటం విశేషం.

అక్రమ ఇసుకను రవాణా చేసే వాహనాల విషయంలో కఠినంగా ఉండాలన్నది ప్రభుత్వ పాలసీ అని.. వెహికిల్స్ ను ఎస్ఐ పట్టుకున్నారని.. తాను విడిచిపెడితే ప్రాబ్లం అవుతుందని చెప్పినా.. ఎమ్మెల్యే శ్రీదేవి వినకుండా తన ధోరణిలో తాను.. వాహనాల్ని విడిచి పెట్టాల్సిందిగా హుకుం జారీ చేశారు.

బయటకు వచ్చిన ఆడియో క్లిప్ తాజాగా చానళ్లలో వైరల్ అవుతోంది. ఆమె ఏం మాట్లాడారు అన్న విషయాన్ని చూస్తే.. హలో.. ఎప్పటి నుంచి చెప్తున్నా? వాళ్లను పంపేయొచ్చుగా..  నీకేమైనా మెంటలా? ఆ రోజు పట్టుకున్నప్పుడే నేను నీకు ఫోన్ చేశానా? లేదా? ఏం మాట్లాడుతున్నావ్. నేనంటే రెస్పెక్ట్ లేదా? అందరిని అయితే వదిలి పెడతావ్. నాన్సెన్స్.. నీవు పంపిస్తావా? లేదా చెప్పు. నా కాళ్లు పట్టుకుని పోస్టింగ్ తెచ్చుకున్నావ్. రెండు నిమిషాల్లో వెళ్లి పోతావ్.. ఎక్స్‌ట్రాలు చేయొద్దు.. లేదంటే ఎస్పీ కి డీజీపీ కి చెబుతా’’ అని తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు. అధికార పక్షానికి కొత్త తల నొప్పిని తెచ్చి పెట్టిన మహిళా ఎమ్మెల్యే తీరు పై సీఎం ఎలాంటి చర్య తీసుకుంటారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. పెరిగిన సాంకేతికత నేపథ్యంలో ఇలాంటి క్లిప్పులు బయటకు వచ్చే అవకాశం ఉందన్న చిన్న విషయాన్ని ఎమ్మెల్యే శ్రీదేవి ఎలా మిస్ అయినట్లు?