Begin typing your search above and press return to search.

గడప గడప : ఎమ్మెల్యే చిట్టిబాబుకు గ‌ట్టి వ్య‌తిరేక‌త‌.. తూర్పులో ఏం జ‌రిగిందంటే

By:  Tupaki Desk   |   16 May 2022 12:30 AM GMT
గడప గడప : ఎమ్మెల్యే చిట్టిబాబుకు గ‌ట్టి వ్య‌తిరేక‌త‌.. తూర్పులో ఏం జ‌రిగిందంటే
X
``మ‌నం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్ర‌బుత్వం కూడా అమ‌లు చేయ‌డం లేదు. కాబ‌ట్టి మ‌న‌పై వ్య‌తిరేక ఉంద‌నేది కేవ‌లం ప్ర‌తిప‌క్షాలు సృష్టిస్తున్న కుట్ర‌లో భాగం. దీనిని ఛేదించండి!`` అంటూ.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ పార్టీ నేత‌ల‌కు సూచించారు. దీంతో వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌జ‌ల బాట ప‌ట్టారు. గ‌డ‌ప గ‌డ‌ప‌కు ప్ర‌బుత్వం పేరుతో ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నారు. దీంతో ఇప్పుడు వారికి అస‌లు నిజం తెలిసింది. ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న‌ది రాద్దాంతం కాదు.. వాస్త‌వ‌మేన‌ని.

సంక్షేమం 10 శాత‌మే!

అంతేకాదు..ఇన్నాళ్లుగా సంక్షేమం చేస్తున్నా.. ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు తీసుకువ‌చ్చి. ప్ర‌జ‌ల‌కు ఏదో చేస్తు న్నామ‌ని చెబుతున్న నాయ‌కుల‌కు.. వాస్త‌వం తెలిసి వ‌చ్చింది. సంక్షేమం కేవ‌లం 10 శాత‌మేన‌ని.. మిగిలి న‌దంతా కూడా... ప్ర‌జ‌లకు సానుకూలంగా ఉండేలా పాల‌న అందించాల‌ని.. అభివృద్ధి చూపించాల‌ని.. రాష్ట్రంలో అన్ని విష‌యాల్లోనూ స‌ర్కారు ప్ర‌స్తుతం వెనుక‌బ‌డింద‌ని.. వారికి అర్ధ‌మైంది. దీంతో నిజంగానే ప్ర‌జ‌ల‌లో వ్య‌తిరేక‌త ఉంద‌నేది వారికి తెలిసివ‌చ్చింది.

ప‌రిస్తితి దారుణం

నిజానికి క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితి దారుణంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. నిజానికి అన్ని వ‌ర్గాల‌కు సంక్షేమం అం దించినా.. అందించ‌క‌పోయినా.. అభివృద్ధి దిశ‌గా రాష్ట్రాన్ని న‌డిపించి ఉంటే... బాగుండేద‌ని.. నాయ‌కులు భావిస్తున్నారు. అయితే.. ఇప్ప‌టికే మూడేళ్లు గ‌డిచిపోయాయి. దీంతో ఇప్పుడు ఏం చెప్పినా.. ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. వాస్త‌వానికి ఆది నుంచి కూడా అభివృద్ధి మంత్రాన్ని ప‌ఠించాల్సిన యువ సీఎం జ‌గ‌న్‌.. సంక్షేమాన్ని మాత్ర‌మే చూస్తున్నారు.

ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు బుట్ట‌దాఖ‌లా?

క‌నీసం.. క్షేత్ర‌స్థాయిలో నియోజ‌క‌వ‌ర్గాల బాట అయినా ఎమ్మెల్యేలు ప‌ట్టారా? అంటే.. అది కూడా లేదు. మూడేళ్ల కాలంలో ఒక్క‌సారి కూడా ఎమ్మెల్యేలు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించ‌లేదు. దీంతో ప్ర‌జ‌క‌లు నాయ‌కుల‌కు మ‌ధ్య గ్యాప్ పెరిగింది. ఇదే ఇప్పుడు వారికి శాపంగా మారింది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ ఇచ్చిన హామీల‌తో పాటు.. స్థానికంగా నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు కొన్ని హామీలు ఇచ్చారు. క్షేత్ర‌స్థాయిలో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తామ‌న్నారు. అయితే.. మూడేళ్ల యినా.. వారు ఆయా స‌మ‌స్య‌ల‌పైదృష్టి పెట్టేలేదు. దీంతో ఇప్పుడు అవే స‌మ‌స్య‌ల‌పై ప్ర‌జ‌లు నాయ‌కుల‌ను నిల‌దీస్తున్నారు.

తాజాగా ఏం జ‌రిగిందంటే..

కోన‌సీమ జిల్లా పి. గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు కొండేటి చిట్టిబాబుకు గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌ల నుంచి అనూహ్య‌మైన ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. దీంతో ఆయ‌న ఏం చేయాలో తెలియ‌క నీళ్లు న‌లిమారు. ఎమ్మెల్యే చిట్టిబాబు గ‌డ‌ప గ‌డ‌ప‌కు భాగంలో కొండుకుదురు గ్రామంలో పర్యటించారు. అక్కడ ప్ర‌జ‌లు ఎన్నో ఏళ్లుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు దాటిగా సమస్యలను పట్టించుకోవడం లేదని నిలదీశారు.

ప్రజల నుంచి అనూహ్య‌మైన‌ ఎదురుదాడి రావడంతో ఎమ్మెల్యే సమాధానాలు చెప్పలేక నీళ్లు నమిలారు. తమ ప్రాంత సమస్యలపై ఓ మహిళ ఎమ్మెల్యేని నిలదీయగా.. `ఈ మూడేళ్లు నాకు ఎందుకు చెప్పలేదు` అని ఆయన ఎదురు ప్రశ్నించారు. దీనికి మ‌హిళ స్ట్రాంగ్ రిప్ల‌య్ ఇచ్చింది. 'మీరు ఎమ్మెల్యేగా గెలిచాక ఇదే కదండీ రావడం' అంటూ ఆమె చిట్టిబాబు పరువు తీసేసింది. మూడేళ్లుగా ప్రజా ప్రతినిధులు తమ వైపు కన్నెత్తి చూడలేదని.. ఇప్పుడు ఇళ్లకు వస్తుండటంతోనే తమ సమస్యలపై నిలదీస్తున్నామంటున్నారు. మొత్తానికి మూడేళ్ల కాలంలో ప్ర‌జ‌ల‌ను విస్మ‌రించిన ఫ‌లితం.. ఇప్పుడు ఎమ్మెల్యేల‌కు క‌ళ్ల‌ముందు క‌నిపిస్తుంటే.. ఏం చేయాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్న ప‌రిస్థితి స‌ర్వ‌త్రా క‌నిపిస్తోంది.