Begin typing your search above and press return to search.

వైసీపీకి తలనొప్పి... ఎంపీపీల ఎంపికలో పీఠముడి!.. చిక్కు విప్పేదెవరో?

By:  Tupaki Desk   |   24 Sep 2021 11:30 AM GMT
వైసీపీకి తలనొప్పి... ఎంపీపీల ఎంపికలో పీఠముడి!.. చిక్కు విప్పేదెవరో?
X
సాదారణంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ సమయంలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించడం సహజమే. దాదాపుగా 98 శాతం ఫలితాలు అధికార పార్టీ అనుకూలంగా ఉంటాయి. అనుకున్నట్లే పంచాయతీ, ‘పుర’పోరులో వైసీపీ తిరుగులేని విజయాలను సాధించింది. అయితే పరిషత్ ఎన్నికలు మాత్రం ఉత్కంఠభరితంగా సాగాయి. ఈ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ బహిష్కరించింది. ఎన్నికలయితే నిర్వహించారు. తీర ఎన్నికలు ముగిసిన తర్వాత హైకోర్టు ఎన్నికల కౌంటింగ్‌కు బ్రేకులేసింది. తర్వాత కౌటింగ్ నిర్వహించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నలిచ్చింది. అందరూ అనుకున్నట్లు వైసీపీ అభ్యర్థులు ఘనం విజయం సాధించారు. ఒకటి రెండు చోట్లు టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. విషృంఖలమైన అధికారం అనర్థాలకు దారి తీస్తుందనే సామెత వైసీపీ నేతలకు సరిపోతుంది. అన్ని జిల్లాల్లోకంటే శ్రీకాకుళం జిల్లా వైసీపీ పరిస్థితి భిన్నంగా ఉంది.

శుక్రవారం 38 మండల పరిషత్‌ల అధ్యక్షుల ఎంపిక నిర్వహించనున్నారు. పరిషత్‌ పోరులో వైసీపీకి అధిక స్థానాలు రావడంతో.. కొన్నిచోట్ల ఎంపీపీ ఎన్నిక లాంఛనప్రాయమే అయినప్పటికీ మరికొన్ని చోట్ల మాత్రం వివాదాస్పదం కానున్నాయి. కొంతమంది ఎంపీటీసీ సభ్యులు ఎంపీపీ పదవిపై ఆశలు పెట్టుకోగా, పెద్దలు మరొకరికి పదవి కట్టబెట్టేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో విభేదాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆశావహులకు సర్దిచెప్పేందుకు జిల్లా నేతలు నానా పాట్లు పడుతున్నారు.

జిల్లాలోని పొందూరు ఎంపీపీ ఎన్నిక ఆశక్తిగా మారింది. మండలంలో మొత్తం 21 ఎంపీటీసీ స్థానాలున్నాయి. అందులో 14 వైసీపీ, 7 టీడీపీ స్థాలను గెలుచుకున్నారు. తీరు అధ్యక్షుడిని ఎన్నుకునే సమయంలో వైసీపీలో వర్గపోరు తీవ్రమైంది. ఆ పార్టీలోని ఎంపీటీసీలు రెండుగా రెండుగా చీలిపోయారు. మరో ఇద్దరు ఎంపీటీసీలు కనిపించకుండా పోయారు. ఇది ఇలావుంటే మరో ఆశ్యర్యకర ఘటన పొందూరులో జరిగింది. వైసీపీలోని ఓ వర్గం టీడీపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో సుఖాంతంగా ఎంపీపీల ఎంపిక జరుగుతుందని భావించిన అధికార పార్టీకి ఇబ్బందులు ఎదురవుతుండడంతో తలపట్టుకుంటున్నారు. పొందూరు అధ్యక్షని ఏ పార్టీ కైవసం చేసుకుటుందో వేచి చూడాలి.

టెక్కలి నియోజకవర్గంలో కూడా ఎంపీపీ అభ్యర్థుల ఎంపిక జఠిలంగా మారుతోంది. నియోజకవర్గంలోని కోటబొమ్మాళి, సంతబొమ్మాళి, టెక్కలి, నందిగాం మండలాల్లో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఒక్క టెక్కలిలో మాత్రం ద్విముఖ పోరు ఉండగా...మిగతా మండలాల్లో మాత్రం ఐదారుగురు అభ్యర్థులు ఎంపీపీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. నందిగాంలో క్యాంపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. సంతబొమ్మాళిలో 20 ఎంపీటీసీ స్థానాలకు 18 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఇక్కడ ఏకంగా ఆరుగురు అభ్యర్థులు ఎంపీపీ పదవిని ఆశిస్తున్నారు. కోటబొమ్మాళి మండలంలో 22 ఎంపీటీసీ స్థానాలకు 20 స్థానాలు వైసీపీ గెలుపొందింది. ఇక్కడ నుంచి కూడా నలుగురు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. నందిగాం మండలం 16 ఎంపీటీసీ వైసీపీ 16 స్థానాల్లో పాగా వేసింది. టెక్కలిలో 22 స్థానాలను వైసీపీ దక్కించుకుంది. ముగ్గురు పోటీ పడుతున్నారు. అధిష్ఠానం, జిల్లా నేతలు ఎవరికి ప్రాధాన్యమివ్వనున్నారో.. మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.