కరోనా పెద్ద పరీక్ష..అంగీకరించిన చైనా అధ్యక్షుడు జిన్ పింగ్

Sun Feb 23 2020 23:23:56 GMT+0530 (IST)

Xi Jinping categorises Corona Virus has biggest National Health Emergency!

చైనాలో ప్రబలిన కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు జి జిన్ పింగ్ దీనిపై స్పందించారు. ఇది తమ దేశంలో అతిపెద్ద హెల్త్ ఎమర్జెన్సీ అని దాన్ని నియంత్రించేందుకు సకల ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. శరవేగంగా వ్యాపిస్తున్న వైరస్‌ను నియంత్రించడం కష్టమవుతోందని ఆయన అన్నారు. అయినప్పటికీ వీలైనంత త్వరలో దీన్ని అరికడతామని ఆయన చెప్పారు.‘‘ఇది మన దేశంలో అతిపెద్ద ఆరోగ్య సంక్షోభం.. పెద్ద పరీక్ష. చైనా ఏర్పడిన 1949 సంవత్సరం తర్వాత ఇది అతిపెద్ద హెల్త్ ఎమర్జెన్సీ. మన సమాజంపై - ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. త్వరలోనే పరిస్థితి చక్కబడుతుంది. ఈ పరిస్థితి కొంత కాలమే ఉంటుంది’’ అన్నారు. కాగా చైనాలో కరోనా వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య అధికారికంగానే 77 వేలు దాటింది. ఇప్పటివరకు 2400 మందికిపైగా చనిపోయారు.

గత రెండు రోజులుగా కొత్తగా దీనిబారిన పడినవారి సంఖ్య చైనాలో తగ్గుతున్నప్పటికీ ఇతర దేశాలకు విస్తరిస్తోంది. దక్షిణ కొరియాలో ఇప్పుడు సమస్య తీవ్రమైంది. ఫ్రాన్స్ - ఇరాన్ వంటి దేశాల్లోనూ ఈ వ్యాధి బారిన పడి మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది.