Begin typing your search above and press return to search.

వుహాన్ లీక్స్: మోన్న కరోనా.. నేడు వయాగ్రా దోమలా?

By:  Tupaki Desk   |   20 Jun 2021 8:06 AM GMT
వుహాన్ లీక్స్: మోన్న కరోనా.. నేడు వయాగ్రా దోమలా?
X
కరోనా వైరస్ ను ప్రపంచానికి అంటించిన పాపం చైనాలోని వూహాన్ నగరానిదే. ఆ నగరంలోని వ్యూహాన్ వైరాలజీ ల్యాబ్ లోనే కరోనాను పుట్టించారని.. అది వ్యాపించిందనే ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. తాజాగా వూహాన్ ల్యాబ్ నుంచి వయాగ్రా దోమలు లీక్ అయ్యాయన్న ప్రచారం మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ వార్త ఇంటర్నెట్ లో వైరల్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది.

వూహాన్ ల్యాబ్ పరిశోధకుల తాజాగా పరిశోధన బెడిసికొట్టిందని ప్రచారం సాగుతోంది. వయాగ్రా మందు ఇంజెక్ట్ చేసిన వేల కొద్దీ దోమలు.. ల్యాబ్ నుంచి బయటపడ్డాయని సమాచారం. ఓ పరిశోధకుడి నిర్లక్ష్యంతోనే ఇది జరిగిందని ల్యాబ్ నిర్వాహకులు ప్రకటించారని వార్తలు వెలువడ్డాయి.

ఆ వయాగ్రా దోమల ప్రభావంతో విపరీత అనర్థాలు చోటుచేసుకున్నాయని.. అవి కుట్టిన వాళ్లు వికృతంగా ప్రవర్తిస్తున్నారని తెలిసింది. లైంగిక కోరికలతో రగిలిపోతూ ఆస్పత్రి పాలవుతున్నారట..

ఈ దోమలు కుట్టిన పండు ముసలోళ్ల నుంచి కుర్రాళ్ల దాకా కామవాంఛతో రగిలిపోతున్నారట.. వూహాన్ కు చెందిన 87 ఏళ్ల వృద్ధుడు ఒకడు కోరికలను తట్టుకోలేక ఆస్పత్రిలో చేరాడట.. మరో పేషంట్ నగ్నంగా తిరుగుతూ పబ్లిక్ గా వికృత చేష్టలకు పాల్పడ్డాడని తెలిసింది. మరోవ్యక్తి కనిపించిన వాళ్లపైన లైంగిక దాడికి పాల్పడుతున్నాడట..

వూహాన్ కెచ్ లీ ఆస్పత్రి డాక్టర్లు ఇచ్చిన ప్రకటన ముందుముందు ప్రపంచవ్యాప్తంగా పాకి ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న భయం వెంటాడుతోందని వరల్డ్ న్యూస్ డెయిలీ రిపోర్టు.కామ్ అనే వెబ్ సైట్ కథనాన్ని ప్రచురించింది.

అయితే అసలు నిజం వేరే ఉందట.. ‘వరల్డ్ న్యూస్ డెయిలీ రిపోర్టు.కామ్ ’ సెటైరికల్ వెబ్ సైట్ అని.. అది నిజాలతో సంబంధం లేకుండా ఇలాంటి వార్తలు సృష్టించి జనాలను నమ్మేలా వైరల్ చేస్తోందని తెలిసింది. ఇందులోని వృద్ధుడు ఫొటో కూడా చైనా వ్యక్తిది కాదని.. జపాన్ వ్యాపారవేత్త యుకిషి చుగంజి అని సమాచారం. దీంతో ఇది ఫేక్ న్యూస్ అని అంటున్నారు.