కరెంటుతో విమానం...ట్రయల్ రన్ సక్సెస్

Sat May 30 2020 08:00:07 GMT+0530 (IST)

World first fully-electric commercial flight takes off

ఎలక్ట్రిక్ బైకు వచ్చింది...  ఎలక్ట్రిక్ కారు వచ్చింది... ఇపుడు ఏకంగా ఎలక్ట్రిక్ విమానమే వచ్చేస్తోంది. వినియోగం పెరిగింది. ఇంధన వనరులు మాత్రం తరుగుతూ ఉన్నాయి. అందుకే ప్రత్యామ్నాయాల వైపు ప్రంచం దుృష్టిసారిస్తోంది. ఈ క్రమంలో అనేక ఆవిష్కరణలు వస్తున్నాయి. అవసరాలను శాశ్వతంగా తీర్చేలా కొత్త టెక్నాలజీ మనకు సహాయపడుతోంది. దీనికి నిదర్శనమే ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ విమానం ఆవిష్కరణ. ఇపుడు అది విజయవంతంగా ప్రయోగించబడింది.ఈ తొలి భారీ ఎలక్ట్రికల్ ఊహించిన సమయం కంటే ముందే ఫలితాలు సాధించింది. ఈ విమానం తొలిసారిగా వాషింగ్టన్ లో ఆకాశయానం చేసింది. సమీపంలోని మోసెస్ సరస్సు వద్ద సుమారు అరగంట సేపు ఇది ఆకాశంలో చక్కర్లు కొట్టి విజయవంతంగా కిందకు దిగింది.ఈ విమానానికి సెస్నా -208 క్యారవాన్ అని నామకరణం చేశారు. అమెరికాకు చెందిన మాగ్ని ఎక్స్ అనే సంస్థ దీనిని తయారు చేసింది. ప్రయోగదశలో దీనిని పూర్తి ఎలక్ట్రికల్ ఇంజిన్ తోనే రూపొందించడం విశేషం. ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ ఇంజిన్ కూడా దీనికి అమర్చలేదు. తొమ్మిది మంది ప్రయాణికులు మాత్రమే ఇందులో కూర్చునే అవకాశం ఉంది.ఇందులో 750 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన మోటార్ ను అమర్చారు. ఈ ప్రయోగంలో తొలిసారి పైలట్ మాత్రమే ప్రయాణించారు.  183 కి.మీల వేగంతో వాషింగ్టన్ లో ప్రయాణం చేసి విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తి చేశారు.

ఈ విజయవంతమైన ప్రాజెక్టును వాషింగ్టన్ లోని రెడ్ మండ్ ప్రాంతంలో మాగ్ని ఎక్స్ అనే స్టార్టప్ కంపెనీ తయారుచేయడం విశేషం. అయితే సీటెల్‌లోని ఏరోటెక్ అనే ఏరో స్పేస్ ఇంజినీరింగ్ అండ్ సర్టిఫికేషన్ సంస్థ ఈ స్టార్టప్ కంపెనీకి సహకారం అందించింది. సక్సెస్ ఫుల్ ట్రయల్స్ చేసిన మాగ్ని ఎక్స్ సూపర్ కాన్పిడెంట్ గా ఉంది. అపుడే కమర్షియల్ సర్వీసుల గురించి ప్రకటన కూడా చేసింది. 2021 నాటికి ఎలక్ట్రిక్ విమానాలతో కమర్షియల్ సర్వీసులను అందుబాటులోకి తెస్తారట. శభాష్ మాగ్ని ఎక్స్.