Begin typing your search above and press return to search.

రాజమౌళి ఈగ కాదు.. దోమ దినమిదీ..!

By:  Tupaki Desk   |   20 Aug 2019 8:20 AM GMT
రాజమౌళి ఈగ కాదు.. దోమ దినమిదీ..!
X
ఆయన దిగ్గజ దర్శకుడు రాజమౌళి. అందుకే హీరోగా ఈగను పెట్టి హిట్ కొట్టాడు. పాపం ఇప్పుడు దోమలు కూడా తెగ ఫీల్ అవుతున్నాయి. తమ తోటి ప్రాణి ఈగను హీరోను చేసిన రాజమౌళి ‘దోమను’ మాత్రం పట్టించుకోకపోవడంపై ఆవేదన చెందుతున్నాయి. అయితే దోమలకు ఒక దినముందని మీకు తెలుసా.? అదీ ఈరోజే..

ఆగస్టు 20 - 1897లో దోమల వల్లే మలేరియా వ్యాపిస్తోందని సికింద్రాబాద్ లో ఉండే ప్రముఖ బ్రిటీష్ శాస్త్రవేత్త రోనాల్డ్ రాస్ చారిత్రక పరిశోధనతో ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పాడు. దీనికి ఆయనకు నోబల్ బహుమతి కూడా వచ్చింది. ఆ ఆవిష్కరణకు గుర్తుగానే ఆగస్టు20న ప్రతీ ఏటా ప్రపంచ దోమల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

దోమల వల్ల మలేరియా - డెంగ్యూ - చికెన్ గున్యాలాంటి ప్రాణాంత వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ముఖ్యంగా మలేరియాతో ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మంది చనిపోతున్నారట.. మలేరియా వ్యాపించడానికి ప్రధానంగా ఆడ అనాఫిలిస్ దోమ కారణం. దీన్నే రోనాల్డ్ రాస్ ఆడ అనాఫిలిస్ దోమ లాలాజల గ్రంతుల్లో మలేరియా పరాన్నజీవి ప్లాస్మోడియం ఉనికిని గుర్తించాడు.

కాగా దోమల నుంచి నివారణకు అందరూ మస్కిట్ ఎలక్ట్రిక్ కాయిల్స్ సహా పొగ వచ్చే రీఫిల్స్ - దోమల బ్యాట్ లు వాడుతూ 500 వరకు ప్రతీనెల ఖర్చు చేస్తుంటారు. అయితే వీటిని ప్రకృతి సిద్ధంగా పారద్రోలే చిట్కాలు బోలెడున్నాయి. ముఖ్యంగా ఒక చిన్న గిన్నెలో నిండానీరు పోసి అందులో కర్పూరం బిల్లులు వేసి పడుకునే బెడ్ పక్కన పెడితే ఆ కర్పూరం వాసనకు దోమలు దరిదాపుల్లోకి రావు. ఇక ఎలక్రిక్ కాయిల్స్ వల్ల వాసనకు పిల్లలు - వృద్దులు ఆయాసపడుతుంటారు. దీనికన్నా వేపనూనెను కాయిల్స్ ఖాళీ డబ్బాల్లో నింపి కరెంట్ ప్లగ్ లో పెడితే ఆ వాసనకు దోమలు బలాదూరట.. ఇక పూదిన మొక్కలను పెంచి ఇంట్లో పెట్టుకుంటే ఆ వాసనకు దోమలు రావట. ఇలా ఎన్నో చిట్కాలు దోమలు నివారణకు ప్రకృతి సిద్ధంగా ఉన్నాయి. రోగాలు రాకుండా కాపాడుకోవడానికి ప్రయత్నించవచ్చు. దోమల దినోత్సవం సందర్భంగా దోమల వ్యాధులకు ఇలా చెక్ పెట్టవచ్చు.