Begin typing your search above and press return to search.

ధనిక దేశాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్రహం .. కారణం ఏంటంటే?

By:  Tupaki Desk   |   23 Feb 2021 2:30 PM GMT
ధనిక దేశాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ  ఆగ్రహం .. కారణం ఏంటంటే?
X
ప్రపంచంలోని పలు అభివృద్ధి చెందిన ధనిక దేశాలు కోవిడ్ వ్యాక్సిన్లను పేద దేశాలకు అందకుండా చూస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెడ్ టెడ్రోస్ ఫైర్ అయ్యారు. పైగా కరోనా వైరస్ టీకామందుల పంపిణీలో ఇవి దీనికి సంబంధించిన సమాచారాన్ని షేర్ చేయకుండా తమ స్వార్థాన్ని చూసుకుంటున్నాయని ఆరోపణలు చేశారు. కొన్ని ధనిక దేశాలు వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే కంపెనీలతో నేరుగా డీల్ కుదుర్చుకుంటున్నాయని, దీనివల్ల మా కోవాక్స్ కార్యక్రమం ద్వారా పేద దేశాలకు అందాల్సిన కేటాయింపులు తగ్గిపోతున్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు.

ఈ దేశాలకు ఎక్కువ డోసులు కావాలంటే నిధులు అవసరం. అమెరికా, యూరోపియన్ యూనియన్, జర్మనీ వీటికి ఆర్థికపరంగా తోడ్పడుతున్నప్పటికీ వ్యాక్సిన్లు అందుబాటులో లేనప్పుడు నిధులు ఉండి కూడా వృధా అని టెడ్రోస్ చెప్పారు. ఆయా కంపెనీలతో బడా దేశాలు ఒప్పందాలు కుదుర్చుకోవడం వల్ల మా కోవాక్స్ కార్యక్రమం నీరు గారిపోతోందని కూడా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంపైనే పేద దేశాలు ఆధారపడి ఉన్నాయన్న విషయాన్ని విస్మరించరాదన్నారు.

మీ దగ్గర నిధులు ఉంటే వాటిని వ్యాక్సిన్లను కొనుగోలు చేయడానికి వ్యయం చేయవద్దు..డబ్బులు ఉన్నంత మాత్రాన అన్నీ ఉన్నట్టు కాదు అని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా వంటి దేశాలు తమకు అవసరమైన వ్యాక్సిన్ల కన్నా ఎక్కువగా 1.25 బిలియన్ల డోసులను సేకరించాయని వన్ కాంపెయిన్ కో-ఫౌండర్, సింగర్ కూడా అయినా బోనో అన్నారు.