Begin typing your search above and press return to search.

వర్క్ ఫ్రం హోం: కంపెనీల కొత్త వ్యూహం

By:  Tupaki Desk   |   26 Sep 2021 10:33 AM GMT
వర్క్ ఫ్రం హోం: కంపెనీల కొత్త వ్యూహం
X
వర్క్ ఫ్రం హోం అంటే ఒకప్పుడు కొందరు ఆడవాళ్లు ఇంట్లో ఉండి పనిచేసునే విధానంగా భావించేవారు. కానీ కరోనా కారణంగా ఐటీ, ఇతర కంపెనీలు వర్క్ ఫ్రం హోంను అమలు చేశాయి. ఇంట్లో ఉండే పనిచేసే వీలు కల్పించింది. అయితే ప్రస్తుతం కరోనా ఉధృతి కాస్త తగ్గిన నేపథ్యంలో కంపెనీలు వర్క్ ఫ్రం హోం ను మెల్లగా తగ్గించే పనిలో పడ్డాయి. కార్యాలయాలను ఓపెన్ చేసి ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కొందరు వర్క్ ఫ్రం హోం అలవాటు పడడంతో కార్యాలయాల్లో భద్రత లేమి కారణంగా ఆఫీసులకు రామని చెబుతున్నారు. అవసరమైతే రాజీనామా చేస్తామని అంటున్నారు. ఈ తరుణంలో టీసీఎస్ కంపెనీ కొత్త విధానాన్ని అమలు చేస్తోంది.

ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు టీసీఎస్ న్యూ పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఉద్యోగుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆ కంపెనీ తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలిస్తున్నాయి. మిగతా కంపెనీలో ఉద్యోగులపై కొంచెం ఒత్తిడి పెంచి ఆఫీసులకు కచ్చితంగా రావాలని హుకుం జారీ చేస్తుండగా టీసీఎస్ లాంటి కంపెనీలు మాత్రం సున్నితంగా వ్యవహరిస్తున్నాయి. ఉద్యోగులు సైతం కంపెనీ ప్రతిపాదనలను స్వీకరించిన కార్యాలయాలకు వెళ్తున్నారు. అయితే కరోనా థర్డ్ వేవ్ ముప్పు ఉందని హెచ్చరికలు వస్తున్నా కంపెనీలు మాత్రం డేర్ స్టెప్ వేయడం ఆసక్తిగా మారింది.

కరోనా కారణంగా చాలా కంపెనీలో వర్క్ ఫ్రం హోం ను అమలు చేశాయి. వీటిలో మొట్టమొదటగా ఐటీ సెక్టార్ ముందుగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. తమ ఉద్యోగులు ఇంటినుంచే పనిచేయాలని గత సంవత్సం కింద ఉద్యోగులకు అవకాశం ఇచ్చింది. అయితే వర్క్ ఫ్రం హోం వల్ల ఇటు సంస్థలకు అటు, ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంస్థ సరైన లక్ష్యాలు సాధించలేకపోవడంతో పాటు అనుకున్న అభివృద్ధి జరగడం లేదు. దీంతో కళ్ల ఎదుట ఉన్న ఉద్యోగుల కంటే ఇంట్లో ఉండే ఉద్యోగులతో సంస్థ ప్రతినిధులు నిత్యం కాంటాక్టు కావడం ఇబ్బందిగా మారింది. దీంతో ఆపీసుల్లో పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నాయి.

ఇక కొందరు ఉద్యోగులు సైతం వర్క్ ఫ్రం హోంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్యామిలీ సమస్యలతో మానసిక ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు సరైన సమయానికి అనుకున్న పని చేయడం లేదు. ఇక ఆఫీసుల్లో ఉండే సౌకర్యాలు ఇంట్లో లేనందున సంస్థ విధించిన లక్ష్యాలను ఛేదించలేకపోతున్నారు. దీంతో ఓ వైపు కంపెనీ నుంచి వేధింపులు, మరోవైపు ఇంట్లో సమస్యలు తాళలేక కొందరు తీవ్ర మానసిక ఆవేదన చెందుతున్నారు. ఇక కొందరు మహిళలు తమ భర్తలు ఇంట్లో ఉండి పనిచేయడం వల్ల తమకు ఇబ్బందులు తప్పడం లేదని ఇటీవల ఓ మహిల కంపెనీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.

ఈ పరిణామలో కంపెనీలో ఆఫీసుల్లో ప్రస్తుతం 50 శాతం వర్కర్లతో పనిచేస్తుండగా.. రాను రాను ఇది వందశాతంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే కొందరు ఉద్యోగులు తమకు ఆరోగ్య భద్రత కల్పిస్తే తాము కార్యాలయాలకు రావడానికి ఇష్టమేనన్నట్లు చెబుతున్నారు. ఈ విషయాలను పరిగణించిన టీసీఎస్ కంపెనీ తమ ఉద్యోగులకు ప్రత్యేకంగా కొన్ని విధానాలను రూపొందించింది. వాటిని తమ ఉద్యోగులతో చర్చించి ఆఫీసుల్లోకి రప్పించే ప్రయత్నం చేస్తోంది.

వాటిలో ఉద్యోగులకు తామే వ్యాక్సినేషన్ చేయించడం. క్రమ పద్ధతిలో సాలరీ హైక్ చేయడం. ప్రత్యేక టూర్లకు అవకాశం ఇవ్వడం. ఫ్యామిలీ టూర్ ప్యాకేజీ ప్రకటించడం లాంటివి చేస్తోంది. ఈ ఆఫర్లకు మురిసిపోతున్న ఉద్యోగులు కార్యాలయాల బాట పడుతున్నారు. అయితే మిగతా కంపెనీలు సైతం ఇలాగే ఉద్యోగులను ఆకర్షించేందుకు కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నాయి.