Begin typing your search above and press return to search.

నదిలో కొట్టుకువచ్చిన చెక్క పెట్టె .. పెట్టెలో 21 రోజుల చిన్నారి !

By:  Tupaki Desk   |   16 Jun 2021 2:30 PM GMT
నదిలో కొట్టుకువచ్చిన చెక్క పెట్టె .. పెట్టెలో 21 రోజుల చిన్నారి !
X
గంగానదిలో ఓ చక్క పెట్టె కొట్టుకువచ్చింది. అందులో ఓ చంటి బిడ్డతో పాటు, అమ్మవారి ఫోటో ఉండటం కలకలం రేపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ లో జరిగింది. ఓ చంటి బిడ్డను ఓ చెక్కపెట్టెలో పెట్టి గంగానదిలో వదిలేసిన ఘటన ఆశ్చర్యానికి గురిచేసింది. నదిలో కొట్టుకొస్తున్న ఓ పెట్టెను కూడా ఒడ్డుకు చేరిన స్థానికులు దాన్ని తెరిచి చూసి షాక్ అయ్యారు. ఆ పెట్టెలో ఓ ఎర్రని వస్త్రం మీద ఓ చంటిబిడ్డ తో పాటు కనకదుర్గ అమ్మవారి ఫోటో కూడా ఉండటం చూసి అంతా అశ్చర్యపోయారు. యూపీలోని ఘాజీపూర్‌ లో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

ఘాజీపూర్‌ లో సదర్ కొత్వాలి ప్రాంతంలోని దాద్రి ఘాట్ వద్ద గంగానదిలో చంటిబిడ్డ ఏడుపులు వినిపిస్తుండటంతో పడవ నడిపే వ్యక్తి ఆశ్చర్యపోయాడు. దీనితో పరిశీలించి చూడగా నదిలో కొట్టుకు వస్తున్న చెక్కపెట్టెనుంచే చంటిబిడ్డ ఏడుపులు వినిపించాయి. దీనితో ఆ చెక్క పెట్టను పట్టుకున్నాడు. తెరిచి చూస్తే అందులో ఆడ బిడ్డ ఉంది. బిడ్డ వయసు 21 రోజులు ఉంటుంది. ఆమెతో పాటు అమ్మవారి పఠాన్ని కూడా పెట్టి ఉంది. పెట్టెలో ఓ పేపర్‌లో జాతకం ప్రకారం..ఆ బిడ్డకు గంగ అని పేరు పెట్టినట్లుగా రాసి ఉంది. దీంతో ఆ పడవ నడిపే వ్యక్తి ఆ బిడ్డను తన ఇంటికి తీసుకెళ్లాడు. బిడ్డను తనకే గంగమ్మే ఇచ్చింది. ఇది నా అదృష్టం అని మురిసిపోయాడు. ఈ బిడ్డను తాను పెంచుకుంటానని చెప్పాడు. అయితే ఈ విషయం స్థానికులు పోలీసులకు తెలియజేయటంతో పోలీసులు ఆ పాపను స్వాధీనం చేసుకున్నారు. బిడ్డను పెంచుకోవడం కుదరదన్నారు. దీనిపై దర్యాప్తు చేయాలన్నారు. బిడ్డను ఆశాజ్యోతి కేర్ సెంటర్ కు తరలించారు.