పదహారేళ్ల వయసులో మారడోనా రేప్ చేశాడట

Wed Nov 24 2021 16:00:01 GMT+0530 (IST)

Women made alligations about Maridona

సంచలన వ్యాఖ్యలు చేశారో మహిళ. క్యూబాకు చెందిన ఆమె.. ఫుట్ బాల్ మాంత్రికుడిగా అభివర్ణించే దివంగత మారిడోనాపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఫుట్ బాల్ దిగ్గజం మరణించి ఏడాది అవుతున్నప్పటికి అతడి మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు షాకింగ్ గా మారాయి. అత్యద్భుతమైన ఫుట్ బాట్ క్రీడాకారుడిగా పేరున్న మారడోనా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు.తాజాగా క్యూబాగాకు చెందిన 37 ఏళ్ల మావిస్ అల్వరెజ్ అనే మహిళ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మారడోనా తన టీనేజ్ జీవితాన్ని నాశనం చేశాడని చెప్పారు. డ్రగ్స్ చికిత్సలో భాగంగా 2001లో మారడోనా క్యూబాకు వచ్చారని చెప్పారు. అప్పటికి అతడికి 40 ఏళ్లు అయితే..తనకు పదహారేళ్లుగా చెప్పింది.

ఆ సమయంలో మారడోనాను తాను కలిశానని.. కొన్ని రోజుల తర్వాత డ్రగ్ ఎడిక్షన్ చికిత్స తీసుకుంటున్న హవానాలోని ఒక క్లినిక్ లో బలంగా తన నోరు మూసి అత్యాచారం చేసినట్లుగా ఆరోపించారు. అప్పట్లో తన అమాయకత్వాన్ని అసరాగా చేసుకొని డీగో తన జీవితాన్ని ఛిద్రం చేశాడని మండిపడింది. అంతకాదు.. అప్పటి దేశాధ్యక్షుడు ఫిడేల్ కాస్ట్రోకు మారడోనాకు మంచి సంబంధాలు ఉండేవన్నారు.

ఈ కారణంతోనే తాను తప్పనిసరి పరిస్థితుల్లో డిగోతో సహజీవనం చేయాల్సి వచ్చిందని చెప్పారు. తమ ఇద్దరి మధ్య వయసు తేడా ఎక్కువగా ఉన్నప్పటికి తాను నాలుగేళ్ల పాటు సహజీవనం చేసినట్లు చెప్పారు. చివరకు తన తల్లిదండ్రులు కూడా అందుకు అంగీకరించాల్సి వచ్చినట్లుగా వాపోయింది. డిగో మరణించిన ఏడాది తర్వాత మీడియా సమావేశం పెట్టి మరీ చేసిన ఈ ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి.