Begin typing your search above and press return to search.

ఉమెన్ టీమిండియా రెడీ అవుతోంది.. ఆటగాళ్లందరికీ అమ్మాయిలే!

By:  Tupaki Desk   |   14 Jan 2021 1:30 AM GMT
ఉమెన్ టీమిండియా రెడీ అవుతోంది.. ఆటగాళ్లందరికీ అమ్మాయిలే!
X
ఇండియా - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న సిరీస్ కోసం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా బాట పట్టిన సంగతి తెలిసిందే. అయితే తన భార్య అనుష్క డెలివరీ ఉండడంతో విరాట్ పితృత్వ సెలవులపై ఇండియాకు తిరిగి వచ్చాడు. ఇటీవలే విరాట్ భార్య అనుష్క పండంటి ఆడ బిడ్డ పుట్టింది. 'మాకు అమ్మాయి పుట్టింది.ఈ విషయం మీతో పంచుకోవడానికి చాలా థ్రిల్ గా ఫీల్ అవుతున్నాం ' అంటూ విరుష్క జంట సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే విరాట్ కు పాప పుట్టిన తర్వాత.. చాలా మంది కి వచ్చిన డౌట్ క్రికెటర్లలో చాలామందికి ఆడపిల్లలే పుట్టినట్టు ఉన్నారు కదా అని.. అని.. అవును వారికొచ్చిన డౌటు నిజమే. ప్రస్తుతం టీమిండియా తరఫున ఆడుతున్న ప్రతి ఆటగాడికి కుమార్తె పుట్టింది. ఆటగాళ్ళం దరికీ అనుకోకుండా ఆడపిల్ల పుట్టడం ఆసక్తి కలిగిస్తోంది.

విరాట్ తర్వాత భారత క్రికెట్ కు అత్యంత ముఖ్యమైన బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ. రోహిత్, రితికా సజ్ద దంపతులకు అమ్మాయి పుట్టింది. చిన్నారి పేరు సమైరా. హిట్ మ్యాన్ కి తన కుమార్తె అంటే వల్లమాలిన ప్రేమ. కాస్త సమయం దొరికినా చాలు కూతురితో గడుపుతుంటాడు. ఏదైనా టూర్ కి వెళితే సమైరాను మిస్ అవుతున్నా అంటూ పోస్టులు పెడుతుంటాడు.

రాహుల్ ద్రావిడ్ తర్వాత భారత్ నయా వాల్ గా చెప్పుకునే పూజారా-పూజ దంపతులకు అదితి అనే కుమార్తె ఉంది. ఆ చిన్నారి చేసే అల్లరి పనులను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ పూజారా మురిసి పోతుంటాడు. టీమ్ ఇండియా టెస్ట్ వైస్ కెప్టెన్ రహానే తన చిన్ననాటి స్నేహితురాలు రాధికను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు 2014లో ఆర్య పుట్టింది. రహానే తన కూతురితో పాటలు పాడిస్తూ గడిపేస్తుంటాడు. ఆ చిన్నారికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటాడు. స్పిన్నర్ అశ్విన్ -ప్రీతి జంటకు ఆద్య, అఖీరా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కరోనా సమయంలో నిబంధనలు పాటించాలి.. అంటూ సోషల్ మీడియా ద్వారా అశ్విన్ కూతుర్లు తమ తండ్రికి జాగ్రత్తలు చెప్పిన వీడియో ఫేమస్ అయింది.

భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తొలి సంతానం కూడా అమ్మాయే. పేరు నిద్యానా. తను పుట్టిన తర్వాతే తాను ఆటలో బాగా రాణిస్తున్నానని, తనే నా లక్కీ స్టార్ అని జడేజా చెబుతుంటాడు.

భారత ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ కూడా ఇటీవలే తండ్రి అయ్యాడు. అతడికి కూడా కుమార్తె పుట్టింది. ఇటీవలే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సురేష్ రైనా-ప్రియాంక జంటకు కూడా అమ్మాయే పుట్టింది. ఆ చిన్నారి పేరు గ్రేసీ రైనా. రైనాకు ఈ చిన్నారి అంటే ఎంత పిచ్చి అంటే ఆమె పేరు కూడా టాటూ వేయించుకున్నాడు. తన కుమార్తె పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాడు.

ఇక టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ కుమార్తె జీవా ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. ధోనీ- సాక్షి జంట జీవా గురించి చెప్పే ముచ్చట్లు అందరినీ ఆకట్టుకుంటుంటాయి.

ఇలా భారత జట్టులోని ఆటగాళ్లందరికీ అమ్మాయిలే పుట్టారు. ఈ విషయం తెలిసిన వారు చాలా ఆశ్చర్య పోతుంటారు. అదేంటీ అనుకోకుండా అందరికీ అమ్మాయిలే పుడుతున్నారు.. అని ఆశ్చర్య పోతున్నారు. దీనిపై జోక్స్ వేస్తున్నారు. టీమిండియా ఆటగాళ్లందరూ కలసి వుమెన్ టీమిండియాను తయారు చేస్తున్నారేమోనని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. భవిష్యత్ లో ఉమెన్ టీమిండియాకి ప్లేయర్స్ వెతుక్కునే పని ఉండదేమోనని పోస్ట్ లు పెడుతున్నారు.