కోట్లు దొబ్బేసిన మహిళ.. ఆపై ప్లాస్టిక్ సర్జరీ.. చివరికి..!

Wed Jan 25 2023 06:00:01 GMT+0530 (India Standard Time)

Women Bank Robbery and Then Plastic Surgery For Face

ఒంటిపై గాయాలు తగిలినపుడో.. గ్లామర్ పెంచుకునేందుకో ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారు. ముఖ్యంగా సెలబ్రెటీలు ముక్కు.. మూతి.. తదితర పార్ట్స్ మెరుగు పర్చేందుకునే ప్లాస్టిక్ సర్జరీలు చేసుకోవడం తరుచూ చూస్తూనే ఉంటాం. అయితే ఓ మహిళ మాత్రం తన నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని 25 ఏళ్లపాటు పోలీసులకు చిక్కకుండా కాలం వెళ్లదీసింది.ఎట్టకేలకు సదరు మహిళను పోలీసులు పట్టుకున్నారు. దీంతో ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సంఘటన చైనాలో జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. చెన్ విల్ అనే మహిళ 1997లో యెకింగ్ లోని చైనా కన్ స్ట్రక్షన్ బ్యాంకులో క్లర్క్ గా విధులు నిర్వహించేది. ఈ క్రమంలోనే బ్యాంకులోని ఓ లోపాన్ని ఆమె గుర్తించింది.

దీనిని ఆసరాగా చేసుకుని బ్యాంకులోని సొమ్మును తన ఖాతాలో మలుచుకుంది. ఏకంగా 6.8 కోట్ల బ్యాంకు సొమ్మును దారి మళ్లించింది. ఇందులోని 4.7 కోట్ల మొత్తాన్ని విత్ డ్రా చేసి తన పుట్టింటికెళ్లి సేఫ్ గా దాచుకుంది. ఆ డబ్బులను డ్రా చేసుకునేందుకు వీలుగా అక్కడే ఓ బ్యాంక్ పాస్ బుక్ ను పెట్టింది. అయితే ఈ విషయం కుటుంబ సభ్యులు తెలియడంతో వారంతా ఆమెను వారించారు.

ఇలాంటివి చేయడం తప్పని చెప్పారు. అంతే కాకుండా కొంత సొమ్మును తిరిగి బ్యాంకుకు ఇచ్చారు. దీంతో చెన్ వైల్ ఎవరి మాట వినకుండా అక్కడి నుంచి ఇతర రాష్ట్రానికి వెళ్లిపోయింది. అక్కడే తన పేరు.. వివరాలు మార్చుకొని మరో మ్యారేజ్ చేసుకుంది. ఒక కుమార్తెకు సైతం జన్మనిచ్చింది. అయితే ఆమెకు దొంగతనానికి ముందు వివాహం జరగడం గమనార్హం.

ఈ క్రమంలోనే చెన్ విల్ దోపిడీ సొమ్ముతో వ్యాపారాన్ని మొదలుపెట్టి అందులో రాణించింది. అయితే పోలీసులు మాత్రం చెన్ విల్ ను పట్టుకునేందుకు 1997 నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని 25 ఏళ్లుగా జీవిస్తున్న ఆమెను ఎట్టకేలకు పోలీసులు ఇటీవల పట్టుకున్నారు. దీంతో చివరికి ఆమె కటకటాలు లెక్క పెట్టాల్సి వచ్చింది. సినిమాను తలదన్నేలా నడిచిన ఈ దొంగతనం చివరికి అదే స్టైల్లో ముగిసిపోవడం గమనార్హం. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.