ఏపీలో ప్రభుత్వ మద్యం దుకాణంపై మహిళల దాడి

Tue Jul 07 2020 22:36:51 GMT+0530 (IST)

Women Attack on Government Liquor Store in AP

మద్యం మహమ్మారిపై మహిళలు సమరశంఖం పూరించారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడులో మహిళలు ప్రభుత్వ మద్యం దుకాణంపై దాడి చేసి నానా బీభత్సం సృష్టించారు. మద్యం సీసాలను ధ్వంసం చేసి పారబోశారు. పగులకొట్టారు.బొద్దికూరపాడులో తాగుబోతుల ఆగడాలు ఎక్కువైపోయానని.. కరోనా కారణంగా పనులు లేక ఇంటి వద్దే ఉంటున్నామని.. మద్యం షాపులు తమ కుటుంబాలను దిగజారుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మగవారంతా డబ్బులన్నీ మద్యానికే ఖర్చు చేస్తున్నారని.. సంపాదనంతా మందుకు తగలేస్తే తాము ఏం తిని బతకాలని మహిళలు ప్రశ్నించారు.

కరోనా కనుమరుగయ్యే వరకు మద్యం షాపులు తెరవొద్దని డిమాండ్ చేస్తున్నట్టు మహిళలు పేర్కొన్నారు. ఇతర గ్రామాల వారు తమ ఊరిలోకి వచ్చి మద్యం తాగుతూ ఇక్కడే ఉంటున్నారని.. తద్వారా కరోనా వ్యాపిస్తోందని మహిళలు ఆరోపించారు. ఈ సందర్భంగా మద్యం షాపులో దూరి సీసాలను పగులకొట్టారు.