ఆమెను రేప్ చేసేందుకు ఆమె భర్తను జైలుకు పంపి మరీ..

Wed Jan 22 2020 14:00:03 GMT+0530 (IST)

Woman gang-raped by her husband friends in Uttar Pradesh

సినిమాల్లోనూ ఇంత దారుణమైన విలనిజం చూపించలేదేమో? అందంగా ఉండే ఆమెను అనుభవించాలని భావించిన కొందరు దుర్మార్గులు.. పక్కా ప్లాన్ వేసిన వైనం తెలిస్తే విస్తుపోవాల్సిందే. ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లా సిరౌలీ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం వింటే.. ఒళ్లు గగుర్పాటుకు గురి కావాల్సిందే. యూపీలోని ఒక చిన్న ఊరు సిరౌలీ. ఆ గ్రామంలో ఒక జంట నివాసం ఉంటుంది. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆమె మీద కన్నేసిన కొందరు యువకులు ఆమెను రేప్ చేయాలనుకున్నారు.భర్త ఉన్నప్పుడు తాము అనుకున్నది జరగదని భావించిన వారు.. పక్కాగా ప్లాన్ వేసి అతడ్ని ఒక దొంగతనం కేసులో ఇరికించారు. ఇదేమీ తెలీని అతగాడు చోరీ కేసులో ఇరుక్కోవటం.. మొరాదాబాద్ జిల్లా జైల్లో ఉన్నాడు. తాము అనుకున్నట్లే భర్తను జైలుకు పంపిన వెంటనే.. ఆ యువకులు ఆమె మీద కోరిక తీర్చుకునేందుకు ఇంట్లోకి దూరారు. నోట్లో గుడ్డలు కుక్కి.. విడతల వారీగా రేప్ చేశారు. ఒకరి తర్వాత ఒకరుగా ఆమెను బల్కాతరించిన వారు.. తాము చేసిన పని బయటకు వస్తే.. ఇరుక్కుపోతామని భావించి భయంతో ఆమెను చంపే ప్రయత్నం చేశారు.

అందులో భాగంగా కత్తితో ఆమె గొంతు కోశారు. కానీ.. ప్రాణాలతో బయటపడిన ఆమె.. ఇరుగుపొరుగు వారిని సాయం కోసం కోరటంతో నలుగురు యువకులు పారిపోయారు. ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆమెపై అత్యాచారం చేసిన నిందితులు యువైస్.. నాజుక్ బేగ్.. రియాసత్ బేగ్.. అఫ్జల్ గా గుర్తించారు. తనపై అత్యాచారం చేసేందుకే ప్లాన్ చేసిన మరీ తన భర్తను దొంగతనం కేసులో ఇరికించారని బాధితురాలి ఆరోపించింది. సంచలనంగా మారిన ఈ కేసును నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు.  

TAGS: