అద్భుతం..9వ అంతస్తు నుంచి పడి బతికిందిలా.!

Tue Jan 28 2020 07:00:04 GMT+0530 (IST)

Woman fall from 9th floor on snow pile in Russia

ఇదో అద్భుతమైన ఘటన.. డాక్టర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేసిన సంఘటన.. ఓ భవంతిలోని 9వ అంతస్తు నుంచి పడి మరీ ఓ మహిళ బతికి బట్టకట్టింది. సాదాసీదాగా లేచి వెళ్లిపోయింది. ఈ భూమ్మీద నూకలు ఉంటే ఎంత ప్రమాదమైనా మన ఉసురు తీయలేదని నిరూపించిన ఘటన ఇదీ..రష్యా దేశంలో అద్భుతం జరిగింది. ఇజ్లుచిన్స్క్ పట్టణంలోని ఒక అపార్ట్ మెంట్ 9వ అంతస్తు కిటికీలోంచి 27 ఏళ్ల ట్రావెల్ అనే మహిళ కింపడింది.పలు సార్లు గాల్లోనే పల్టీలు కొట్టి మరీ భూమిని ఢభీల్ మనీ శబ్ధం చేస్తూ తాకింది. అయితే ఆమెకు చిన్న గాయం కూడా కాలేదు. వెంటనే లేచి అక్కడి నుంచి పొరుగున ఉన్న మహిళ దగ్గరకు వెళ్లి అంబులెన్స్ కు ఫోన్ చేయమని చెప్పింది. ఆస్పత్రిలో చేరింది.

9వ అంతస్తు నుంచి పడ్డ ట్రావెల్ సరిగ్గా మంచు కుప్ప మీద పడింది. పశ్చిమ సైబీరియాలోని ఇజ్లుచిన్స్క్  పట్టణంలో ప్రస్తుతం మైనస్ 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఎముకలు సైతం గడ్డకట్టే ఆ చలికి భారీగా కురుస్తున్న మంచుపై ట్రావెల్ పడడంతో ఎలాంటి గాయాలు కాలేదు. కానీ పైనుంచి పడడం వల్ల అదరడంతో ఆమె నరాలు కొంచెం ఒత్తిడికి లోనుకావడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. అయితే మంచుకుప్ప పై పడిన మహిళకు పరీక్షలు చేసిన వైద్యులు ఆమెకు ఒక్క ఎముక కూడా విరిగకపోవడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మెడికల్ హిస్టరీలోనే ఇదో అరుదైన ఘటనగా అభివర్ణించారు. ట్రావెల్ పడిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.