Begin typing your search above and press return to search.

సక్సెస్ స్టోరీ...మిస్ ఫ్యాటీ టు మిస్ బ్రిటన్ రన్నరప్

By:  Tupaki Desk   |   27 Feb 2020 11:30 PM GMT
సక్సెస్ స్టోరీ...మిస్ ఫ్యాటీ టు మిస్ బ్రిటన్ రన్నరప్
X
బ్రిటన్ కు చెందిన జెన్ ఆట్కిన్(26)....చూడ్డానికి కాస్త ముద్దుగా....చాలా బొద్దుగా ఉండేది....అయితే, 110 కిలోల బొద్దుతనం ఆ ఆట్కిన్ కు అడ్డంగిగా మారింది...మరీ లావుగా ఉన్నావంటూ ఆట్కిన్ కు అవమానాలు...చీదరింపులు ఎదురయ్యేవి...దాదాపుగా కుదిరిందనుకున్న పెళ్లి సంబంధం కూడా చెడిపోయింది....మామూలుగా అయితే...ఇంత జరిగిన తర్వాత చాలామంది అమ్మాయిలు ఆత్మస్థైర్యం కోల్పోతారు....కానీ, ఆట్కిన్ అలా చేయలేదు. అవరోధాలను అధిగమించాలని బలంగా సంకల్పించింది. తనను చూసి నవ్విన వారితోనే నువ్వు గ్రేట్ అనిపించుకోవాలనుకుంది...అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించింది.....రెండేళ్లు తిరగక ముందే తన బరువును 60 కిలోలకు తగ్గించుకోవడమే కాకుండా....ఏకంగా మిస్ బ్రిటన్ 2020 రన్నరప్ గా నిలిచి నవ్విన నాపచేనే పండుతుందని తనను విమర్శించిన వారికి జవాబిచ్చింది. నాడు ఆట్కిన్ ను చూసి ఛీత్కరించుకున్న వారే నేడు ఆమె సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు.

అకుంటిత దీక్ష...పట్టుదల....కఠోర శ్రమ...క్రమశిక్షణ ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆట్కిన్ నిరూపించింది. తన బరువును తగ్గించుకోవాలని బలంగా సంకల్పించింది. వెయిట్ లాస్ అయ్యేందుకు గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే, లైపో సెక్షన్ వంటి రిస్కీ వ్యవహారాల జోలికి వెళ్లకుండా జిమ్, ఫిట్ నెస్, డైట్ పై ఫోకస్ చేసింది. వారంలో 5 రోజులు జిమ్ లోనే గడపడంతో పాటు....జంక్ ఫుడ్ కు స్వస్తి చెప్పింది. హెల్దీ డైట్ తీసుకుంటూనే కొవ్వు కరిగించింది. రెండేళ్ల పాటు కష్టపడ్డ ఆట్కిన్ 50 కిలోల వరకు బరువు తగ్గింది. బరువు తగ్గడంతో పాటు మంచి ఫిజిక్ సొంతం చేసుకున్న ఆట్కిన్ ను చూసి అందరూ ముక్కున వేలేసుకున్నారు. బరువు తగ్గాం కదా...అని సంతోష పడని ఆట్కిన్....మిస్ గ్రేట్ బ్రిటన్ 2020 పోటీల్లో పాల్గొంది. కల్పనా రాయ్ లా ఉన్న ఆట్కిన్ ఐశ్వర్యా రాయ్ లా మెరుపు తీగ మాదిరి తయారైన ఆట్కిన్ అందానికి జడ్జిలు ఫ్లాట్ అయ్యారు. దీంతో, ఈ పోటీల్లో ఫస్ట్ రన్నరప్ గా ఆట్కిన్ నిలిచి అందరినీ అబ్బుర పరిచింది. అట్కిన్ పోరాటం అందరికి సక్సెస్ స్టోరీ ఎందరికో ఆదర్శమని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.