మాస్క్ లేనందుకు రేప్ చేశాడట..?

Thu Jun 17 2021 08:00:01 GMT+0530 (IST)

Woman Allegedly Stripped and Raped Multiple Times by Surat Cop for Not Wearing Mask

గుజరాత్ లోని సూరత్ లో ఓ అమానుష ఘటన సంచలనమైంది.  సూరత్‌లోని ఒక పోలీసు కానిస్టేబుల్ మాస్క్ లేకుండా బయటకు వచ్చిన ఒక వివాహితను పట్టుకొని కేసులు పెడుతానంటూ బెదిరించి అత్యాచారం చేశాడని బాధిత మహిళ ఆరోపించింది. గత ఏడాది జరిగిన ఈ దారుణాన్ని ఆమె తాజాగా పంచుకుంది. 33 ఏళ్ల మహిళ  తను మాస్క్ పెట్టుకోలేదని ఓ పోలీస్ అత్యాచారం చేశాడని ఆరోపించింది. నిందితుడిని సూరత్‌లోని ఉమర్‌పాడ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే కానిస్టేబుల్ గా ఆమె పేర్కొంది. మాస్క్ పెట్టుకోలేదని తనపై చర్యలు తీసుకుంటామని బెదిరించాడని.. బలవంతంగా అత్యాచారం చేశాడని ఆ మహిళ ఆరోపించింది.

ఫొటోలు వీడియోలు తీసి కొద్ది నెలలుగా  తనపై పలుసార్లు అత్యాచారం చేశాడని బెదిరించాడని ఆ మహిళ పేర్కొంది. ఒక వైపు మహిళ అత్యాచారం ఆరోపణలను నిందితుడు కానిస్టేబుల్ భార్య ఇదో కులతత్వంలో చేసిన ఆరోపణ అని కొట్టిపారేసింది.

ప్రాధమిక దర్యాప్తులో కానిస్టేబుల్ ఇంతకు ముందు పల్సానా పోలీస్ స్టేషన్లో పనిచేశాడని తేలిందని మీడియాలో వార్తలు వచ్చాయి. జనవరిలో ఉమర్పాడా పోలీస్ స్టేషన్ కు బదిలీ చేయబడ్డాడని చెబుతున్నారు..

నిందితుడు అపహరణ అత్యాచారం బ్లాక్ మెయిల్ తో మహిళను వేధించాడన్న ఆరోపణలపై విచారణ జరిపినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి..2020 లాక్డౌన్ సమయంలో పల్సానాలో పాలు కొనడానికి మహిళ వెళుతుండగా నిందితుడు ఆమెను అపహరించాడని.. ముసుగు ధరించనందున బెదిరించాడని బాధిత మహిళ ఆరోపించింది.. మహిళను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లే బదులు ఆమెను నవసరి రోడ్డు వద్దకు తీసుకెళ్లి అక్కడ కొట్టాడని అత్యాచారం చేశాడని మహిళ ఆరోపించారు. దీనిపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.