జగన్ లేకుంటే.. చంద్రబాబు ఉద్యమించలేరా..?

Sun Jul 25 2021 17:00:01 GMT+0530 (IST)

Without Jagan Chandrababu would not have started the movement

టీడీపీ అధినేత 14 సంవత్సరాల సీనియర్ మాజీ సీఎం 40 ఇయర్స్ ఎబౌ.. పొలిటికల్ ఇండస్ట్రీ చంద్రబాబుకు భయం పట్టుకుందా ? ఆయన స్వయంగా కేంద్రంపై ఉద్యమించే పరిస్థితి లేకుండా పోయిందా? అంటే.. తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను బట్టి ఔననే అంటున్నారు పరిశీలకులు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై పోరాడిన పరిస్తితి ఇన్నేళ్ల హిస్టరీలో చంద్రబాబు ఎప్పుడూ చేసింది లేదు. పైగా ఆయన ఉద్యమాలకు పోరాటాలకు కూడా కడుదూరం. నిజానికి పోరాటాల ద్వారా సాధించేది ఏంటి ? అంటూ.. ఆయన ఎప్పుడూ.. ప్రశ్నిస్తూనే ఉంటున్నారు. అలాంటి చంద్రబాబుకు ఇప్పుడు జగన్ పాలనలో ఉద్యమాలు చేయాల్సిరావడం సహజంగానే ఒకింత ఇబ్బందిగానే ఉందని అంటున్నారు పరిశీలకులు.అయితే.. చంద్రబాబు ఎంత తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నా.. ఉద్యమ బాట పట్టడం తప్పడంలేదు. అంతేకాదు.. రోడ్డెక్కాల్సిన పరిస్థితి కూడా వస్తోంది. అయితే.. చంద్రబాబు మనస్తత్వానికి ఉద్యమాలకు మధ్య సంబంధం లేకపోవడంతో తాజాగా చంద్రబాబు ఓ వింత ప్రతిపాదన తీసుకువచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. సాగే ఉద్యమానికి తాము సిద్ధమని.. అవసరమైతే.. తమ ఎంపీలు రాజీనామాలు చేసేందుకు రెడీగా ఉన్నారని.. చంద్రబాబు చెప్పారు.ఈ మేరకు విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమ కమిటీకి చంద్రబాబు లేఖ రాశారు. అయితే.. ఆ వెంటనే ఆయన ఈ ఉద్యమానికి సీఎం జగన్ నాయకత్వం వహించాలని పేర్కొన్నారు. ఆయన ముందుండి నడిపించాలని.. చంద్రబాబు విన్నవించారు.

దీంతో బాబుపై విమర్శలు వస్తున్నాయి. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు ఇప్పుడు విశాఖ ఉక్కు ఉద్యమం విషయం లో మాత్రం ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు ? అనే ప్రశ్న తెరమీదికి వచ్చింది. అంతేకాదు.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మీడియా ముందు డైలాగులకే పరిమితం అవుతారా ? లేక కేంద్రంతో ఉద్యమించే సత్తా చూపుతారా ? అని కూడా ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇప్పుడు చంద్రబాబు తీవ్ర సంకటంలో చిక్కుకున్నారని అంటున్నారు పరిశీలకులు.

ఎందుకంటే.. పార్టీ పరంగా ఆయన ముందుండి ఉద్యమాన్ని నడిపించాల్సింది పోయి.. జగన్‌ను ముందు పెట్టి.. ఉద్యమం నడిపించాలని కోరుకోవడం.. అంటే.. అటు కేంద్రానికి ఆయన భయపడుతూ అయినా.. అయి ఉండాలని.. లేకపోతే.. ఉద్యమాలకు తాను వ్యతిరేకమనే సంకేతాలు పంపినట్టయినా.. అయివుండాలని అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి చంద్రబాబు తన లేఖ ద్వారా చిక్కుకుపోయారని అంటున్నారు. అదే సమయంలో జగన్ ముందుండి పోరాటం చేస్తే అప్పుడు క్రెడిట్ జగన్‌కు వెళుతుందే కాని.. చంద్రబాబుకు ఎందుకు వస్తుందన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. చంద్రబాబు వైఖరి పార్టీ నేతలకే నచ్చడం లేదు.