Begin typing your search above and press return to search.

ఏపీ అసెంబ్లీలో కొత్త రూల్‌.. విశ్లేష‌కుల మాట ఇదే...!

By:  Tupaki Desk   |   23 Nov 2021 6:34 AM GMT
ఏపీ అసెంబ్లీలో కొత్త రూల్‌.. విశ్లేష‌కుల మాట ఇదే...!
X
ఏపీ అసెంబ్లీలో కొత్త రూల్ తీసుకురానున్నారా ? ఇక‌పై ఎలాంటి అవాంఛ‌నీయ వ్యాఖ్య‌లు, సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా.. ప‌టిష్ట‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకునేలా చ‌ర్య‌లు చేప‌ట్ట‌నున్నారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. శుక్ర‌వారం అసెంబ్లీలో జ‌రిగిన ఘ‌ట‌న‌ను టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌నకు అనుకూలంగా మార్చుకున్నారు. ఏం జ‌రిగింద‌నేది రికార్డుల రూపంలో ఎక్క‌డా లేక‌పోయినా.. చంద్ర‌బాబు మాత్రం మీడియా ముందుకు వ‌చ్చారు.

బోరున విల‌పించారు. త‌న‌కు, త‌న కుటుంబానికి భారీ ఎత్తున అవ‌మానం జ‌రిగింద‌న్నారు. దీనికి ఎమ్మెల్యేలు.. ఫ‌లానా వారంటూ.. పేర్లు కూడా వెల్ల‌డించారు. దీంతో ఆయా నేత‌ల చుట్టూ ..ఇప్పుడు విమ‌ర్శ‌ల పర్వం న‌డుస్తోంది.

అంతేకాదు.. ఇలాంటివారిపై సీఎం జ‌గ‌న్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో సాధార‌ణంగానే ప్ర‌భుత్వం డిఫెన్స్‌లో ప‌డుతుంది.

అయితే.. అదేస‌మ‌యంలో స్పీక‌ర్‌గా ఉన్న త‌మ్మినేని సీతారాం కూడా ఇబ్బంది ప‌డుతున్నారు. ఆయ‌న‌ను కూడా కొంద‌రు టార్గెట్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు.. ఈ విష‌యాన్ని మ‌రింత తీవ్రంగా.. ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లి త‌మ‌కు అనుకూలంగా ప్ర‌జ‌ల‌ను స‌మీక‌రించుకునేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు.

దీంతో ఇప్పుడు క‌నుక‌.. ఈ విష‌యంలో స్పందించ‌క‌పోతే.. చ‌ర్య‌లు తీసుకోక‌పోతే.. రేపు ఇదే విష‌యాన్ని బాబు ఓటు బ్యాంకుగా మార్చుకునే అవ‌కాశం ఉంద‌ని వైసీపీ నాయ‌కులు అంచ‌నా వేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా జ‌రుగుతున్న అసెంబ్లీలో.. దీనిపై స్వ‌యంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. ఇప్పుడు జ‌రుగుతున్న అసెంబ్లీ మొత్తం ఆరు రోజుల పాటు జ‌ర‌గ‌నుం ది. ఇందులో ఇప్ప‌టికే రెండు రోజులు పూర్త‌య్యాయి.

ఈ నేప‌థ్యంలో చివ‌రి రోజు శుక్ర‌వారం ఘ‌ట‌న‌పై చ‌ర్చించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా అస‌లు స‌భ‌లో ఏం జ‌రిగింది? చంద్ర‌బాబు కుటుంబా న్ని నిజంగానే అసెంబ్లీలో దూషించారా? అన్న వివ‌ర‌ణ ఇవ్వ‌డంతోపాటు.. ఇక‌పై ఇలాంటి దూష‌ణ‌ల‌కు తావివ్వ‌కుండా.. ఒక కొత్త రూల్ తీసుకువ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని.. తెలుస్తోంది.

ప్ర‌తి స‌భ్యుడిని గౌర‌వించుకుంటూ.. స‌మ‌స్య‌ల‌పైనే ఫోక‌స్ పెట్టేలా.. స‌భ నిర్వ‌హించేందుకు ఉప‌యుక్తం గా ఉండే కొత్త రూల్‌ను తీసుకువ‌స్తార‌ని అంటున్నారు. మ‌రి ఇదే జ‌రిగితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న దుమారం పోయే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.