Begin typing your search above and press return to search.

టైం చూసుకొని మ‌రీ అద్వానీని పెద్దాయ‌న భ‌లే గిల్లారే?

By:  Tupaki Desk   |   19 April 2019 10:54 AM GMT
టైం చూసుకొని మ‌రీ అద్వానీని పెద్దాయ‌న భ‌లే గిల్లారే?
X
రాజ‌కీయాల్లో శాశ్విత శ‌త్రువులు.. శాశ్విత మిత్రులు అన్న‌టోళ్లు ఉండ‌రు. అలానే.. రాజ‌కీయ నేతలు చెప్పే మాట‌లు అవ‌స‌రానికి త‌గ్గ‌ట్లు మారుతూ ఉంటాయి. వారు చెప్పిన మాట మీద ఎట్టి ప‌రిస్థితుల్లో ఉండ‌ని రంగాల్లో రాజ‌కీయ రంగం మొద‌టి స్థానంలో నిలుస్తుంద‌ని చెప్పాలి. మాజీ ప్ర‌ధానిగా.. పెద్ద‌మ‌నిషిగా.. జేడీఎస్ అధినేత‌గా వ్య‌వ‌హ‌రించే దేవెగౌడ తాజాగా ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు.

మూడేళ్ల క్రితం తానిక ఎన్నిక‌ల్లో పోటీ చేసేది లేద‌ని చెప్పిన ఆయ‌న‌.. తాజాగా మాత్రం ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వ‌టంపై ప‌లువురు త‌ప్పు ప‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు. దీనిపై వివ‌ర‌ణ ఇచ్చే క్ర‌మంలో ఆయ‌న నోటి వెంట ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు వ‌చ్చాయి. పోటీ చేయ‌న‌ని మూడేళ్ల క్రితం చెప్పిన మాట నిజ‌మేన‌ని.. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు మారాయ‌న్న ఆయ‌న‌.. తాను పోటీకి దిగ‌టాన్ని స‌ర్ది చెప్పుకున్నారు.

అంద‌రి ఇష్టంతోనే పోటీకి దిగాన‌ని.. ఈ విష‌యాన్ని తాను దాచ‌టం లేద‌న్నారు. అద్వానీ మాదిరి తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోనంటూ కురువృద్ధుడ్ని కెలికే ప్ర‌య‌త్నం చేశారు. ప‌ద‌వులు అనుభ‌వించాల‌న్న త‌ప‌న కానీ.. ప్ర‌ధాన‌మంత్రి కావాల‌న్న ఆశ కానీ త‌న‌కు లేవ‌న్న ఆయ‌న‌.. పార్టీని కాపాడుకోవ‌టానికి.. ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌న్న‌ది త‌న ల‌క్ష్య‌మ‌న్నారు.

గ‌తంలో తాను ప్ర‌ధాని కావ‌టానికి సోనియాగాంధీ స‌హ‌క‌రించార‌ని.. ఇప్పుడు రాహుల్ ను ప్ర‌ధాని చేయ‌టం త‌న బాధ్య‌త‌గా ఆయ‌న అస‌లు ఎజెండా చెప్పేశారు. తాజా ఎన్నిక‌ల్లో తుముకూరు స్థానం నుంచి పోటీకి దిగిన దెవేగ‌డ‌.. తాను పోటీ ఎందుకు చేస్తున్న విష‌యాన్ని చెప్ప‌టం వ‌ర‌కూ ఓకే. ఆ పేరుతో పాపం పెద్ద మ‌నిషిని కెల‌క‌టం అవ‌స‌ర‌మా? అనిపించ‌క మాన‌దు.