Begin typing your search above and press return to search.

రేవంత్ వ్యూహం స‌క్సెస్ అయ్యేనా..?

By:  Tupaki Desk   |   27 Sep 2022 12:30 AM GMT
రేవంత్ వ్యూహం స‌క్సెస్ అయ్యేనా..?
X
రాజ‌కీయాల్లో వ్యూహాల‌కు కొద‌వ‌లేదు. ఎక్క‌డ ఎప్పుడు ఎలాంటి అవ‌స‌రం వ‌చ్చినా..నాయ‌కులు ఆరోటి కాడే పాడ‌తారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ చీఫ్‌.. రేవంత్‌రెడ్డి కూడా అదే పాట పాడుతున్నారు. ఆయ‌న పీసీపీ చీఫ్ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌..వ‌చ్చిన రెండో ఉప ఎన్నిక కావ‌డంతో.. ఆయ‌న దూకుడు పెంచారు. గ‌తంలో సాగ‌ర్ ఉప ఎన్నిక జ‌రిగింది. అయితే.. అప్ప‌ట్లో ఆయ‌న పీసీసీ చీఫ్‌గా కొత్త కావ‌డంతో అక్క‌డ చ క్రం తిప్ప‌లేక పోయారు. కానీ, ఇప్పుడు మునుగోడుపై మాత్రం ఆయ‌న ప‌క్కా లెక్క‌ల‌తో ఉన్నారు.

ఈ క్ర‌మంలోనే మునుగోడులో విజ‌యం ద‌క్కించుకునేందుకు ఆయ‌న త‌న‌వంతు వ్యూహాల‌ను అమలు చే స్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. మునుగోడులో పాల్వాయి స్ర‌వంతికి టికెట్ ఇప్పించుకోవ‌డంతోనే ఆయ‌న త‌న వ్యూహాల‌కు ప‌దును పెట్టారు. ఈ క్ర‌మంలో ఇప్పుడు తాజాగా టీడీపీ క‌త్తిని కూడా బ‌య‌ట‌కు తీశారు. ఎందుకంటే.. టీడీపీ సానుకూల ఓట్లు.. సెటిల‌ర్ల ఓట్ల‌ను కాంగ్రెస్ వైపు మ‌ళ్లించేందుకు రేవంత్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు.

ఈ క్ర‌మంలో తాను టీడీపీ బిడ్డ‌నేన‌ని.. కాంగ్రెస్‌లోకి కోడ‌లుగా వ‌చ్చాన‌ని చెప్పారు. అంటే.. టీడీపీ వాళ్లంతా త‌న‌ను, తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కాంగ్రెస్‌ను ఆద‌రించాల‌ని.. ఆయ‌న చెప్ప‌క‌నే చెప్పారు. ఎందుకం టే.. టీడీపీ నుంచి వ‌చ్చిన‌.. రేవంత్ కు ఆ పార్టీలో ఇప్ప‌టికీ అభిమానులు ఉన్నారు.  అంతేకాదు.. ఆయ‌న మాట‌ల‌ను నిశితంగా గ‌మ‌నించే నేత‌లు కూడా ఉన్నారు. సో..ఆయ‌న ఈ ఓట్ల‌ను త‌న‌వైప‌పు ఎందుకు మ‌ళ్లించుకోకూడ‌ద‌నే వ్యూహంతో ముందుకుసాగుతున్నారు.

ఇక‌, రేవంత్ ఫైర్ బ్రాండ్‌ కావ‌డం.. కూడా టీడీపీ నేత‌ల‌ను ఆక‌ర్షించేందుకు సానుకూలంగా ఉంది. ఎందు కంటే.. టీడీపీ లో ఉన్న‌వారు. బీజేపీలోకి వెళ్లే ప్ర‌య‌త్నం చేయ‌రు. ఆ పార్టీకి మ‌ద్ద‌తు కూడా ఇవ్వ‌రు. ఇక‌, అధికార టీఆర్ ఎస్ ..వీరిని పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు.

దీంతో రేవంత్‌రెడ్డి.. త‌న‌కున్న ప‌రిచ‌యాల‌తో టీడీపీ నేత‌ల‌ను త‌న‌వైపు తిప్పుకొనే వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నారు. ఇప్ప‌టికైతే.. రేవంత్ వైపు వారు చూస్తున్నార‌ని సంకేతాలు వ‌స్తున్నాయి. దీంతో రేవంత్ కూడా వారిని చేర‌దీయ‌డం ద్వారా.. మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగ‌రేయాల‌నే సంక‌ల్పంతో ముందుకు సాగుతున్నారు. మొత్తానికి ఆయ‌న వ్యూహం ఫ‌లించ‌డం ఖాయ‌మ‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.