Begin typing your search above and press return to search.

కరాటే కల్యాణీకి నగర బహిష్కరణ ఉంటుందా..?

By:  Tupaki Desk   |   16 May 2022 7:54 AM GMT
కరాటే కల్యాణీకి నగర బహిష్కరణ ఉంటుందా..?
X
యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డిపై దాడి ఘటనతో మరోసారి వార్తల్లో నిలిచింది వివాదాస్పద నటి కరాటే కళ్యాణి. పరస్పర దాడుల నేపథ్యంలో ఇరువురిపై కేసులు నమోదు అవ్వడంతో.. గత మూడు రోజులుగా ఈ వ్యవహారం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది.

ప్రాంక్ వీడియోల పేరుతో ఆడవాళ్లని అసభ్యకరంగా చూపిస్తూ.. మహిళల గౌరవాన్ని కించపరుస్తున్నాడంటూ శ్రీకాంత్ తో కల్యాణీ గొడవకు దిగడం.. ఈ క్రమంలో ఇద్దరూ పరస్పరం కొట్టుకోవడం.. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్న సంగతి తెలిసిందే.

అయితే సమాజం శాంతిభద్రతలను కాపాడే చట్టం న్యాయాలను పట్టించుకోకుండా.. చంపేస్తా అంటూ పదేపదే వ్యాఖ్యానిస్తున్న కరాటే కల్యాణీని చూసి అసలు ఈ గోల ఏంటి అని పలువురు సినీ ప్రముఖులు డిస్కస్ చేస్తున్నారట.

ఎలాగూ ఇప్పుడు సినిమాలలో ఆమెకు అవకాశాలు లేవు కాబట్టి.. మీడియాను మరియు ఆర్టిస్టులను తిట్టడం.. ఎలా పడితే అలా అనేస్తూ పబ్లిసిటీ తెచ్చుకోవాలని చూస్తోందని.. కల్యాణీ కి సోషల్ మీడియా పిచ్చి పీక్స్ అయిపోయిందనే సినీ ఆడియన్స్ విమర్శలు చేస్తున్నారు.

శాంతి భద్రతలను కాపాడుకోవటానికి ఉద్దేశించి చట్టాన్ని.. దాన్ని అమలుచేసే న్యాయస్థానాలు లేదా పోలీసులకు ఈ దేశంలో విలువ ఉంది. అందరూ వాటికి కట్టుబడి ఉంటారనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కానీ ఇప్పుడు కరాటే కల్యాణీ చట్టంపై ఏమాత్రం గౌరవం లేదనే విధంగా వ్యవహరిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.

యూట్యూబ్ లో వచ్చే కంటెంట్ మీద అభ్యంతరాలు ఉంటే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. న్యాయబద్ధంగా నోటీసులు ఇవ్వొచ్చు. ఆడవాళ్ళను అగౌరపరిస్తే మహిళా సంఘాల ద్వారా పోరాడవచ్చు. ఏదైనా చట్టానికి లోబడే మనం పని చేయాలి. లేకపోతే చట్టం తనపని తాను చేసుకుపోతుందనే సంగతి అందరికీ తెలుసు.

ఈ వివాదంలో కరాటే కల్యాణీ ముందుగా శ్రీకాంత్ రెడ్డి మీద చేయి చేసుకుంది. అతని దగ్గరకు వెళ్లి కొట్టడమే కాదు.. పక్కనే ఉన్న మరో వ్యక్తి కొట్టేలా చేసింది. ఈ క్రమంలో అతను కూడా చేయి చేసుకున్నాడు.. ఇరువురు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఇంత రచ్చ జరిగిన తర్వాత మళ్ళీ మీడియాలోకి వచ్చి 'వాడిని చంపేస్తా.. వాడు బ్రతకకూడదు' అనే విధంగా మాట్లాడుతోంది.

చట్టం న్యాయం మీద గౌరవం లేకుండా కల్యాణీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే.. ఆమెను నగర బహిష్కరణ చేయాలి లేదా మానసిక వైద్యులకు చూపించి చికిత్స అందించాలనే విధంగా చాలా మంది మాట్లాడుతున్నారు. ఇక్కడ శ్రీకాంత్ ను సమర్ధించడం లేదు. కానీ అతని వీడియోలు అభ్యంతరకరంగా ఉంటే.. పోలీసులకు కంప్లైంట్ చేయాలి.

న్యాయబద్ధంగా అతనికి శిక్ష పడేలా చేయిస్తే.. అందరూ ఆమెను శభాష్ అంటారు. కానీ అతని వద్దకు వెళ్లి అసభ్య పదజాలంతో దూసిస్తూ దాడి చేయడం.. దాన్ని సమర్ధించుకోవడం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా మీడియాలో తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఇలా అయితే ఎవరూ సినిమాలు.. టాక్ షోలు చేయరు. టిక్ టాక్ లు.. ఇన్స్టాగ్రామ్ ఫేస్ బుక్ సెటైర్స్ రావు. తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకోవాలనే వారెవరూ ముందుకు రారని అంటున్నారు. కల్యాణీకి నచ్చకపోతే వాటికి దూరంగా ఉండొచ్చు. నాకు నచ్చేలేదు కాబట్టి.. నేను వెళ్లి ఎవరినైనా కొడతా.. చంపేస్తా అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

ఇంత రచ్చ చేయకుండా సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేస్తే బాగుండేదని ఆమెకు సలహాలు ఇవ్వడం తప్పితే.. ఇంకేమి చేస్తారని అనుకుంటున్నారు. ఏదేమైనా ఈ వ్యవహారంలో తప్పొప్పులను పక్కన పెడితే.. కల్యాణీ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఉండకుండా ఉండాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇదిలా ఉంటే కరాటే కల్యాణి ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆమె అక్రమంగా ఓ చిన్నారిని కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులు అందడంతో.. అధికారులు ఆమె ఇంటికి వెళ్లి పాప గురించి వివరాలు తెలుసుకున్నారు. చిన్నారిని చట్టబద్దంగా దత్తత తీసుకుందా లేదా అనే విషయంపై ఆరాలు తీశారని తెలుస్తోంది.