Begin typing your search above and press return to search.

వందేళ్ల ఉత్పాతానికి కేసీఆర్ బయటకు రారా?

By:  Tupaki Desk   |   20 Oct 2020 6:15 AM GMT
వందేళ్ల ఉత్పాతానికి కేసీఆర్ బయటకు రారా?
X
అందరూ ఇంత నష్టం జరిగింది? అంత నష్టం జరిగిందని చెబుతున్నారు. మేం కానీ మా ముందు వాళ్లు కానీ.. అంతకు ముందువాళ్ల వల్ల కానీ నష్టం జరిగింది. మొత్తంగా ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం. అయినా.. ఇప్పుడు కురిసిన వర్షాలు అంతా ఇంతా కాదు. చరిత్రలో చాలా అరుదైనవి. 1908 తర్వాత.. వందేళ తర్వాత హైదరాబాద్ కు వచ్చిన ఉత్పాతమిది.. అంటూ సరిగ్గా ఇలానే చెప్పారని చెప్పట్లేదు కాదు.. ఈ అర్థంలో వచ్చేలా మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్.

వందేళ్ల తర్వాత వచ్చిన ఉత్పాతమన్నప్పుడు దాని తీవ్రత ఎంతన్నది ఆయనే తన నోటితో తానే స్వయంగా చెప్పేశారు. అరుదుగా చోటు చేసుకునే ఇలాంటి ఉత్పాతల వేళలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు రారా? తెలంగాణ ప్రజల్ని.. హైదరాబాద్ నగర వాసుల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడరా? అన్నది ప్రశ్న. ఏదైనా కష్టం వచ్చినప్పుడు అందరూ వచ్చి.. దగ్గరకు చేరి.. ఏదో చేయాలని ఆశించం. కానీ.. దగ్గరైన వాళ్లు.. అయినోళ్లుఆస్త.. బంధువులు మాట సాయం అయినా చేస్తే బాగుంటుందని అనుకుంటాం.

కష్టం వచ్చినప్పుడు ఆస్తులు ఇవ్వనక్కర్లేదు.. కనీసం మాట సాయంగా ఉంటే చాలన్న భావన ప్రతి ఒక్కరికి కలిగేదే. అలా చూసినప్పుడు.. ఇప్పుడు ఎదురైన కష్టం.. నష్టం మామూలు కాదు. ఇలాంటివేళలో.. రాష్ట్రానికి పెద్ద అయిన ముఖ్యమంత్రి సీన్లోకి వచ్చి.. బాధితుల్ని ఊరడించేలా నాలుగు మాటలు చెబితే ఏమవుతుంది. కరోనా టైంలో కల్లోలిత ప్రాంతాల్లో తిరగమని చెప్పట్లేదు.కనీసం.. హెలికాఫ్టర్ లో హైదరాబాద్ మహానగరం మొత్తాన్నినాలుగైదు సార్లు రౌండ్లు కొడితే.. ఎవరో ఏదో చెప్పే మాటలకు.. తనకు తాను స్వయంగా తన కళ్లతో చూసే దానికి తేడా ఉంటుంది కదా?

కేసీఆర్ లాంటి మాస్టర్ మైండ్.. తనతో పాటు..అర్బన్ ఫ్లడింగ్ లో నిపుణులైన వారిని వెంట పెట్టుకొని.. జరిగిన నష్టం.. ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు.. వారి సమస్యల పరిష్కారానికి ఏం చేస్తే బాగుంటుందన్న విషయాన్ని కనుక్కొనే ప్రయత్నం చేయొచ్చు కదా? ప్రగతిభవన్ లో ఎడతెగని రివ్యూలు పెట్టే కేసీఆర్.. ఈ మాత్రం పని చేయలేరా? అది కూడా చరిత్రలో అరుదుగా చోటు చేసుకునే విపత్తులో.. వందేళ్ల తర్వాత వచ్చిన ఉత్పాతంలో అన్నది అసలు ప్రశ్న.