Begin typing your search above and press return to search.

తెలంగాణపై జనసేన నమ్మకం ఫలిస్తుందా?

By:  Tupaki Desk   |   25 Jan 2023 1:00 PM GMT
తెలంగాణపై జనసేన నమ్మకం ఫలిస్తుందా?
X
జనసేన పార్టీ అధినేత మంగళవారం తెలంగాణలో పర్యటించారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టులో ఆయన ప్రచారం నిర్వహించే వాహనం 'వారాహి'కి పూజలు నిర్వహించారు. అంతేకాకుండా అంజన్న సన్నిధిలోనే వారాహిపై నిల్చొని మాట్లాడారు. దీంతో వచ్చే ఎన్నికల సమరానికి జనసేన సిద్ధమైనట్లు కనిపిస్తోంది. అయితే ఏపీలో పుంజుకుంటున్న జనసేన తెలంగాణలో ఏం చేస్తోంది..? అనేది ఇంతకాలం కొనసాగిన సస్పెన్స్. కానీ కొండగట్టు పర్యటన సందర్భంగా పవన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగానలో బీఆర్ఎస్ ను స్వాగతిస్తున్నామన్నారు. అంటే బీఆర్ఎస్ తో పొట్టు పెట్టుకుంటారా..? లేక అసలు తెలంగాణలో పోటీ చేయడానికి సిద్ధంగా లేరా..?

ఇదే కొండగట్టు పర్యటనలో పవన్ కల్యాణ్ మరో విషయం తేల్చాడు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు కొనసాగిస్తామని క్లారిటీ ఇచ్చాడు. అలాగే వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వం అని అన్నారు. అంటే తెలుగుదేశం పార్టీతో కూడా ఆయన పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. అయితే ఏపీలో టీడీపీ, బీజేపీ లతో కలిసి వెళ్లడం ఓకే. కానీ తెలంగాణకు వచ్చే సరికి ఆ పరిస్థితి భిన్నంగా ఉంటుంది. తెలంగాణలో టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ ను స్వాగతిస్తున్నామని చెప్పడం ద్వారా ఆయన గులాబీ పక్షమే అని అర్థమవుతోంది.

అయితే తెలంగాణలోని కొన్ని సీట్లలో జనసేన పోటీ చేయాలని చూస్తోంది. కానీ అందుకు బీఆర్ఎస్ సహకరిస్తుందా..? అనేది తేలలేని అంశం. ఈ నేపథ్యంలో తెలంగాణలోని జనసేన నాయకులు పోటీ చేయకుండా ఉంటారా..? అలా చేయడానికి వీల్లేదు. ఒకవేళ కంప్లీట్ గా బీఆర్ఎస్ పక్షాన చేరితే ఈ రాష్ట్రంలో ఇక జనసేన కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదు. అందువల్ల పార్టీ కేడర్ ను కాపాడుకోవడానికి ఇక్కడ జనసేన వ్యూహం రచించాల్సిన అవసరం ఉంది.

ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో సరైన నాయకులు ఉంటే పోటీలో నిలబెట్టేందుకు ప్రయత్నించాలి.తెలంగాణలోని అన్ని సీట్లలో కాకపోయినా కొన్ని సీట్లలో జనసేన పోటీ చేస్తేనే అభిమానులు, కార్యకర్తలు పవన్ తో కలిసి వస్తారు. లేకుంటే పవన్ ను సాధారణ పొలిటీషియన్ గానే ట్రీట్ చేస్తారు.

సినిమాల్లో నటించడంవల్లనో లేక నూతన రాజకీయ ఓనమాలు నేర్చుకుంటున్నాడో.. తెలియదు గానీ.. కొండగట్టు పర్యటన సందర్భంగా తెలంగాణలో పవన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. కొండగట్టుకు రాకముందు పవన్ బీఆర్ఎస్ పై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

దీంతో పవన్ రాకను దృష్టిలో పెట్టుకొని అభిమానులు జనసేన ఫ్లేక్సీలు ఏర్పాటు చేసి హంగామా చేశారు. కొందరు తమ ప్రాంతాల్లో నాయకులమని ప్రకటించుకున్నారు. అయితే వారాహి పూజ తరువాత ఆయన బీఆర్ఎష్ ను స్వాగతిస్తున్నామని చెప్పడంతో కొందరిలో నిరాశ కలిగింది.

అప్పటి వరకు తెలంగాణలో జనసేన పోటీ చేస్తే తమకు లాభిస్తుందని భావించిన వాళ్లు ఇప్పుడు ఆ అవకాశం లేదని నిట్టూర్చుతున్నారు. ఎందుకంటే ఇప్పటిక కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్న బీఆర్ఎష్ జనసేన కోసం సీట్లను త్యాగం చేసే పరిస్థితి లేదు.

అంతో ఇంతో సొంత బలం ఉన్న నాయకులే జనసేన పేరుతో పోటీ చేయాలి. కానీ జనసేన అధికారికంగా తెలంగాణలో అన్ని సీట్లలో పోటీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో తెలంగాణ విషయంలో పవన్ ఫుల్ క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పరిస్థితి భట్టి నిర్ణయం తీసుకోవడం తప్పా కచ్చితంగా పోటీచేస్తానని మాత్రం పవన్ చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.