నువ్వు మొగోడివైతే నా మొగుడ్ని చంపంటూ చెప్పి మరీ చంపించింది

Sun Aug 01 2021 09:23:32 GMT+0530 (IST)

Wife planned to Kill Her Husband

భర్త ప్రాణం కోసం యమధర్మరాజుతోనే పోరాడిన నేలగా అభివర్ణిస్తారు. పురాణాల్ని పక్కన పెట్టేయండి.. మొగుడు ప్రాణాల కోసం తల్లడిల్లటం తర్వాత.. వాడ్ని సజీవంగా బతకనిచ్చేట్లు కూడా లేరు ఈ తరానికి చెందిన కొందరు భార్యా'మణులు'. మారిన కాలంలో భార్యభర్తల బంధం ఇప్పుడు కొత్త సందేహాలను తీసుకొచ్చేలా మారింది. తమకు లభించే సుఖ సంతోషాలు ఏ మాత్రం సరిపోవట్లేదన్న దురాశతో.. ఇంకేదో కావాలన్న అత్యాశ.. భర్తల్ని చంపించే భార్యల లిస్టు ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. పక్కాగా ప్లాన్ చేసి భర్తను చంపే భార్యల ఉదంతాలు ఇప్పటివరకు విన్నాం. ఇప్పుడు చెప్పే ఉదంతం మరో అడుగు ముందుకు వెళ్లిన ఉదంతంగా చెప్పాలి.సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం దుంపల్లి లో ఒక హత్య జరిగింది. కట్ చేస్తే.. సీన్లోకి ఎంటరైన పోలీసులు దాని డొంక లాగే ప్రయత్నం చేశారు. తమదైన పద్దతిలో విచారణ జరిపిన వారికి.. హత్య చేసిన నిందితుడితో పాటు.. దానికి ప్లాన్ చేసిన భార్య దొరికేసింది. వారు చెప్పిన వివరాలు పోలీసులకు సైతం షాకింగ్ గా మారాయి. ఇదెక్కడి భార్యరా అనిపించే ఈ ఉదంతంలో వారిద్దరు ఏం చెప్పారంటే?

దుంపల్లికి చెందిన రెడ్డయ్య (45)కు అప్పుడెప్పుడో తిరుపతమ్మతో వివాహమైంది. వారి వైవాహిక జీవితం సాగుతుండగా.. ఆరేళ్ల క్రితం ఇంటి పక్కనే ఉండే అఫ్రోజ్ తో అక్రమ సంబంధం ఏర్పడింది. అయితే.. అఫ్రోజ్ మధ్యలో దుబాయ్ వెళ్లి వచ్చాడు. అయినప్పటికి వారి మధ్య వివాహేతర సంబంధం మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇదిలాఉంటే.. తాజాగా ప్రియుడితో కలిసి ఉండేందుకు.. మొగుడ్ని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసిన తిరుపతమ్మ.. అప్రోజ్ ను రెచ్చగొట్టింది.

నువ్వు మొగోడివైతే.. నా భర్తను చంపేయగలవా? నా మొగుడ్ని చంపితే రైతుబీమా వస్తుంది.. మనకు డబ్బులు రావటమే కాదు.. ఆస్తి నా పేరున ఉంటుంది.. మన రిలేషన్ కు శాశ్వితంగా అడ్డు తొలుగుతుందని రెచ్చగొట్టింది. దీంతో.. ఆవేశానికి పోయిన అప్రోజ్ దారుణమైన ప్లాన్ వేశాడు. దీంతో రెడ్డయ్యతో మాటలు కలిపిన అప్రోజ్ మందు బాటిల్ కొని.. బైక్ మీద ఎక్కించుకొని బులుపాలగుట్ట వద్దకు తీసుకెళ్లి పీకల్లోతు వరకు తాగించాడు.

మద్యం మత్తులోకూరుకుపోయాక అక్కడే ఉన్న రాయితో తలను మోదాడు. చనిపోయాడో లేడో అన్న సందేహంతో తలపాగాతో గొంతుకు చుట్టి ఉరేసి చంపేశాడు. ప్రియుడితో ఉండేందుకు రెచ్చగొట్టి మరీ భర్తను చంపించిన తిరుపతమ్మను.. మాటలతో రెచ్చగొడితే రెచ్చిపోయి రెడ్డయ్యను చంపేసిన అఫ్రోజ్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.