Begin typing your search above and press return to search.

భర్తను క్రికెట్ బ్యాట్ తో ఉతికి ఆరేస్తున్న భార్య

By:  Tupaki Desk   |   26 May 2022 3:28 AM GMT
భర్తను క్రికెట్ బ్యాట్ తో ఉతికి ఆరేస్తున్న భార్య
X
కొన్నింటి గురించి చెప్పినంతనే భలే బడాయి మాటలు మాట్లాడేస్తావేం? అనే మాట పలువురి నోట వినిపిస్తుంటుంది. తాము చెప్పిన విషయాన్ని వారి కంటితో చూసే అవకాశం వచ్చినప్పుడు మాత్రం.. నోట మాట రాకుండా మాన్పడిపోయి.. నిజంగా ఇలా కూడా చేస్తారా? అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తుంటారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి తాజాగా వైరల్ గా మారింది. అందులో భర్తను భార్య క్రికెట్ బ్యాట్ తో అదే పనిగా బాదేసిన వైనం చూస్తే నోట మాట రాక మానదు.

భర్తల ఆగ్రహాం భార్యలకు శాపంగా మారటం చూస్తుంటాం. ఇంట్లో భర్తలు పెట్టే వేధింపుల గురించి పలువురు భార్యలు గళం విప్పుతూ తమకు న్యాయం చేయాలని వేడుకుంటూ ఉంటారు. ఇప్పుడీ వీడియోను చూసిన తర్వాత మాత్రం ఇలాంటి భార్యలు కూడా ఉంటారా? అన్న సందేహంతో పాటు షాక్ కు గురి కాకుండా ఉండలేరు. అంతేకాదు.. అలాంటి భార్యే తమకు వస్తే అన్న ఊహే వణుకు పుట్టేలా చేస్తుందని చెప్పక తప్పదు.

రాజస్థాన్ కు చెందిన మహిళ ఒకరు తన భర్తను క్రికెట్ బ్యాట్ తో ఇష్టం వచ్చినట్లుగా కొట్టేసిన వీడియో బయటకు వచ్చి వైరల్ గా మారింది. ఇంతకూ ఈ వీడియోలోని జంట విషయానికి వస్తే..రాజస్థాన్ కు చెందిన అజిత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి హర్యానాకు చెందిన సుమన్ ను ఏడేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

ఈ జంట అల్వార్ జిల్లాలో నివాసం ఉంటున్నారు. అజిత్ సింగ్ ఒక విద్యా సంస్థలో ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్నారు. పెళ్లైన కొత్తల్లో వీరి సంసారం బాగానే సాగినా.. ఆ తర్వాత మాత్రం దారి తప్పింది.

ఇద్దరి మధ్య మొదలైన విభేదాలతో గొడవలు షురూ అయ్యాయి. ఈ క్రమంలో భర్తపై భార్య సుమన్ చేయి చేసుకోవటం మొదలు పెట్టింది. పలు సందర్భాల్లో భర్తను దారుణంగా కొట్టేది. ఇటీవల కాలంలో ఈ కొట్టే తీరు అంతకంతకూ ఎక్కువైపోవటంతో భరించలేని సదరు భర్త కోర్టును ఆశ్రయించాడు. తన భార్య నుంచి తనకు రక్షణ కల్పించాలని కోరాడు.

తన భార్యకు కోపం వస్తే చేతికి ఏం దొరికితే దానితో తనపై దాడి చేస్తున్నట్లుగా వాపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలోనూ రెండు సందర్భాల్లో బ్యాట్ తో ఇష్టం వచ్చినట్లుగా కొడుతున్న వైనం కనిపిస్తుంది. ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించిన వీడియోల్లో భర్తపై భార్య చేయి చేసుకున్న వైనం స్పష్టంగా కనిపిస్తుండటం.. వారి కుమారుడు బెదిరిపోవటం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సదరు భర్తకు రక్షణ కల్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.