కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం స్తంభించింది. ఎక్కడి కార్యకలాపాలు అక్కడే నిలిచిపోయాయి. ఇక దాదాపు ఏడాదిన్నరపాటు అంతర్జాతీయ రాకపోకలు ఆగిపోయాయి. కాగా ఇప్పుడిప్పుడే విదేశీ ప్రయాణాలు మెరుగవుతున్నాయి. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుదల వ్యాక్సినేషన్ వల్ల ఇతర దేశాలకు వెళ్లడానికి అనుమతులు వస్తున్నాయి. అయితే ఇన్నాళ్లు వేచిచూసిన వాళ్లు ఆలస్యం చేయకుండా చెక్కేస్తున్నారు. మళ్లీ కరోనా విజృంభించే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో విదేశీ ప్రయాణాలకు మొగ్గు చూపుతున్నారు. ఉన్నత చదువులు. ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లాలనుకునేవారు వీసా కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే మనదేశం నుంచి విద్యార్థులు ఎక్కువ మంది యూకే వెళ్తున్నారు.
భారతీయ విద్యార్థులు ఎక్కువశాతం యూకేవైపు
మొగ్గుచూపుతున్నట్లుగా తెలుస్తోంది. కొవిడ్ అనంతరం ఉపాధి చదువుల కోసం ఆ
దేశానికి వెళ్లడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ఎందుకంటే
కొవిడ్ ప్రభావంతో యూరప్ లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కాటుకు
ఎక్కువ ప్రాణనష్టం జరగడం వల్ల ఆ ఖాళీని భర్తీ చేయడానికి యూకే
ప్రయత్నిస్తోంది. అందుకే త్వరితంగా వీసాలను మంజూరు చేస్తోంది. ఈ ప్రాసెస్
సులభంగా ఉండడం వల్ల చాలామంది యూకేకు వెళ్లడానికి మొగ్గు చూపుతున్నారని
సమాచారం.