Begin typing your search above and press return to search.

మేక పాలకు ఎంత పెట్టి కొంటున్నారంటే.. మేక పాలకు ఎందుకంత డిమాండ్

By:  Tupaki Desk   |   25 Oct 2021 12:30 AM GMT
మేక పాలకు ఎంత పెట్టి కొంటున్నారంటే.. మేక పాలకు ఎందుకంత డిమాండ్
X
కరోనా సంక్షోభం తర్వాత వ్యాధి అనే పదం వినపడితే చాలు వణికిపోతున్నారు. చికిత్సా పద్ధతులు, పరిష్కారాల కోసం తెగ వెతుకుస్తున్నారు. సంప్రదాయ, ఆధునిక వైద్యం అనే తేడా లేకుండా అన్నింటినీ పరిశీలిస్తున్నారు. తెలిసినవారందరి ముందు తమ సందేహాలు వెలిబుచ్చి సమాధానాలు తెలుసుకుంటున్నారు. ఇది మంచి ఔషధం అని ఎవరైనా కాస్త ధీమా వ్యక్తం చేస్తే చాలు.. ఇక అది మనకు దక్కాల్సిందే. ఎంత ఖరీదైనా చెల్లించి ఔషధాలను సొంతం చేసుకుంటున్నారు.. తప్పులేదు.. ప్రాణంపై తీపి ఎవరికైనా ఉండేదే. అయితే.. ఈ క్రమంలో కొన్ని ఆసాధారణ ట్రెండ్లు కూడా ఉనికిలోకి వస్తున్నాయి. ఇప్పుడు అల్లోపతి వైద్యం అందని ద్రాక్షగా మారిపోయింది. అందుకే తిరిగి సంప్రదాయ, ఆయుర్వేద వైద్యంపై ఆదరణ చూపుతున్నారు.

డెంగీ జ్వరం సోకిన ప్రతి ఒక్కరికి రక్తకణాల సంఖ్య తగ్గిపోవడం సాధారణం. రక్తకణాలు (ప్లేట్‌లెట్‌ కౌంట్‌) 80 వేల కంటే తగ్గితే ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోవాలి. దీంతో ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇదేకోవలోనే మధ్యప్రదేశ్‌లో మేకపాలతో ప్లేట్‌లెట్ల పెరుగుతాయని ప్రచారం జరిగింది. ఇంకేమంది మేక పాల కోసం ఎగబడ్డారు. ఏకంగా మేక పాలను లీటరు 300 రూపాయలు పెట్టి కొంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఛత్తార్‌పూర్‌ పట్టణ పరిసరాల్లో డెంగీ కేసులు పెరిగాయి. ప్లేట్‌లెట్ల సంఖ్య పెరగాలంటే మేక పాలు తప్పకుండా తాగాల్సిందేననే ప్రచారం జరగింది. ఇంకేముంది వారం కిందట లీటరుకు రూ.30 కూడా పలకని మేక పాలను రూ.300 పెట్టి కొన్నారు. దీన్ని గమనించిన మేకల యజమానాలు అమాంతం రేటు పెంచారు.

ఇటీవల హర్యానాలోని నుహ్ జిల్లాలో కూడా లీటరు మేక పాలకు రూ.500లకు కొన్నారు. నుహ్ జిల్లాలో డెంగీ విజృంభించింది. వందలాది డెంగీ కేసులు అక్కడ నమోదయ్యాయి. అక్కడ కూడా ఎవరో మేక పాలతో ప్లేట్‌లెట్ల పెరుగుతాయని ప్రచారం చేశారు. ఈ ప్రచారంతో పాటు డెంగీ నుంచి బయటపడేందుకు మేక పాలు తాగితే మంచిదని అక్కడి ప్రజలు విశ్వాసం. మేక పాలను తాగడం ద్వారా ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుందని వారి నమ్మకం. ఇంకేముంది రూ.400-రూ.500 చెల్లించి మరీ లీటరు పాలను కొనుగోలు చేశారు. అయితే మేక పాల ద్వారా ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుందని వైద్యులు ఖండించారు. డెంగీ వచ్చిన వారు మేకపాలు తాగాలనే నియమమేదీ లేదని వైద్యులు చెబుతున్నారు.