Begin typing your search above and press return to search.

కోడిగుడ్డులో ఆకుపచ్చ చందమామ.. సీక్రెట్ రివీల్

By:  Tupaki Desk   |   28 May 2020 2:30 AM GMT
కోడిగుడ్డులో ఆకుపచ్చ చందమామ.. సీక్రెట్ రివీల్
X
గడిచిన కొద్ది రోజులుగా మిస్టరీగా మారిన వెరైటీ కోడిగుడ్డు లెక్క తేలింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ కోడిగుడ్ల వ్యవహారం కేరళలో వెలుగు చూసింది. తక్కువ వ్యవధిలో.. ఈ విచిత్రమైన కోడిగుడ్ల మీద పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. గుడ్డు లోపల ఆకుపచ్చ సొన ఎలా సాధ్యమైందన్నది తేల్చేందుకు శాస్త్రవేత్తలు సైతం రంగంలోకి దిగారు. కేరళలోని ఒక ఫామ్ లో ఈ చిత్రమైన గుడ్ల వ్యవహారం చోటు చేసుకుంది.

ఒక వ్యక్తి తాను చూసిన విచిత్రమైన కోడిగుడ్ల విషయాన్ని ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. దీంతో.. ఇదో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ.. కోడిగుడ్లు పెట్టే గుడ్లు ఆకుపచ్చ సొనతో ఉండటానికి కారణం.. ఆ రంగులోని ఆహారం తినటమే కారణంగా తేల్చారు. కోడిగుడ్లకు పెట్టిన ఆహారంలో సహజసిద్ధమైన రంగునిచ్చే మొక్కల్ని తినటంతోనే ఇలాంటి పరిస్థితి ఉందని తేల్చారు.

ఈ గుడ్లలో ఎలాంటి జన్యుపరమైన సమస్యలు లేవని తేల్చారు కేరళ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోల ఆధారంగా.. సదరు ఫౌల్ట్రీకి వెళ్లారు. అక్కడి కోళ్లను పరిశీలించారు. అవి పెట్టే గుడ్లను తీసుకెళ్లి అధ్యయనం చేశారు. ఇదంతా అవి తినే ఆహారం కారణంగా సొన రంగు మారినట్లు తేల్చారు. కోళ్లకు పెట్టే ఆహారం మార్చేసిన తర్వాత రెండు వారాల వ్యవధిలో పసుపు రంగులో గుడ్లు పెట్టినట్లు వెల్లడించారు. మొత్తానికి పలు వాదనలకు కారణమైన కోడిగుడ్ల మిస్టరీ.. తాజా తేలినట్లైంది.