Begin typing your search above and press return to search.

గ్రామాల్లో టీఆర్ఎస్ ఎందుకు వీక్ అయ్యింది?

By:  Tupaki Desk   |   4 Aug 2020 2:30 AM GMT
గ్రామాల్లో టీఆర్ఎస్ ఎందుకు వీక్ అయ్యింది?
X
తెలంగాణను ఏలుతున్న టీఆర్ఎస్ పార్టీ గ్రామాల్లో వీక్ అయ్యిందా? క్యాడర్ ను అధిష్టానం పట్టించుకోవడం లేదా? కమిటీలు వేయడం లేదా.? ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా పరిస్థితి ఉందా అంటే ఔననే అంటున్నాయి గులాబీ వర్గాలు..

ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ గ్రామాల్లో వీక్ అయ్యిందని కొన్ని లోకల్ సర్వేల్లో చెప్తున్నారు. టీఆర్ఎస్ కు బాగా పట్టు ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాలు అయిన కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లో బీజేపీ ఉనికి లేకపోయినా ఆ మూడు ఎంపీ స్థానాలు భారీ మెజారిటీతో గెలవడంతో అక్కడ బీజేపీ బలంగా తయారవుతోంది.

బీజేపీ అక్కడ గ్రామాల్లో అనూహ్యంగా పుంజుకుందని.. అదే విధంగా దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుందని సర్వేల్లో తేలిందట.. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మూడు ఎంపీ స్తానాలు గెలుచుకుంది. దీంతో అక్కడ బలంగా తయారవుతోంది. ఇక ఉత్తర తెలంగాణలో ఎంపీలు బండి సంజయ్, అరవింద్ లు బీజేపీ తరుఫున దూసుకొని పోతున్నారని తేలింది.

కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బలంగా తమ ఎంపీ నియోజకవర్గాల్లో దూసుకుపోతూ బలంగా తయారు చేస్తున్నారు. గ్రామాల్లో కులపరంగా బీజేపీకి బీసీలు.. కాంగ్రెస్ కు రెడ్లు బాగా దగ్గర అవుతున్నారు అని అంటున్నారు.. టీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్స్ అయిన కేటీఆర్, హరీష్ రావులు మున్సిపాలిటీలకే పరిమితం అవుతున్నారు. దీంతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గ్రామాల్లో పట్టుతగ్గుతోందని పెద్ద ఎత్తున తెలంగాణ గ్రామాల్లో చర్చ జరుగుతోంది.