Begin typing your search above and press return to search.

ఆడవాళ్లనే కన్యాదానం ఎందుకు చేస్తారు? భారత సంప్రదాయాలపై సవాల్

By:  Tupaki Desk   |   24 Sep 2021 3:30 AM GMT
ఆడవాళ్లనే కన్యాదానం ఎందుకు చేస్తారు? భారత సంప్రదాయాలపై సవాల్
X
20 ఏళ్లు వచ్చే వరకు అమ్మాయిులు తల్లిదండ్రుల వద్ద ఉంటారు. ఆ తరువాత పెళ్లి చేసుకొని అత్తారింటికి పోతారు. ఈ క్రమంలో అమ్మాయిలు ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వెళ్లినప్పుడు కన్యాదానం అని అంటున్నారు. ఇది హిందూ సాంప్రదాయంలో వస్తున్న ఆనవాయితీ. ఒక అమ్మాయి ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మాత్రమే వెళుతుందని అలాంటప్పుడు అమ్మాయిని ఎవరు కన్యాదానం చేస్తున్నారు..? అమ్మాయికి స్వేచ్ఛా స్వాతంత్రాలు లేవా..? అమ్మాయి ఎవరి హక్కు అని భావిస్తున్నారు..? అని ఈ మధ్య సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది. అయితే ఈ విషయం ఓ అడ్వర్టయిజ్మెంట్లో ఓ హీరోయిన్ చెప్పిన డైలాగ్ లతో కొందరు ఏకీభవించగా.. మరికొందరు హిందూ సాంప్రదాయాలను మంటగలుపుతున్నారని విమర్శిస్తున్నారు. ఇంతకీ కన్యాదానం అంటే ఏమిటి..? ఆడవాళ్లనే కన్యాదానం ఎందుకు చేస్తారు..?

ఓ అడ్వర్టయిజ్ మెంట్ లో ప్రముఖ నటి ఆలియా భట్ నటించింది. ఇందులో ఆమె 'మాన్యవార్ మెహో' దుస్తుల షాపింగ్ కోసం నటించింది. వధువు పాత్రలో ఆలియా భట్ కనిపిస్తుంది. అమ్మాయిల మనసుల్లో ఆచారాలు, సాంప్రదాయాలు అనే సంకెళ్లు తెగి స్వేచ్ఛా ప్రపంచంలోకి వెళ్తుంది..'అమ్మాయి పరాయి ఆస్తి ఎలా అవుతుంది..? అమ్మాయిలనే ఎందుకు కన్యాదనాం చేస్తారు..? అని అలియా భట్ అంటుంది. అయితే ఇందులో వరుడి తల్లిదండ్రులు వెంటనే తమ కొడుకు చేయి తీసుకొని చేతులు ముందుకు చాపడంతో 'కొత్త ఐడియా కన్యామాన్' అని ఆలియా భట్ అంటుంది.

ఈ యాడ్ పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అమ్మాయిలు ఈ యాడ్ ను షేర్ చేస్తూ 'అవును అమ్మాయిలను మాత్రమే ఎందుకు కన్యాదానం చేయాలి..?' అని రీ ట్వీట్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం హిందూ సాంప్రదాయాలను మంట గలిపేందుకే ఇలాంటి అడ్వర్టయిజ్మెంట్లు అని విమర్శిస్తున్నారు. 'హిందువుల భావాలకు ఇది విరుద్ధంగా ఉంది. కన్యాదానం అంటే అర్థం చేసుకోండి... అంతేగాని వ్యతిరేకంగా ఆలోచించకండి' అని వారికి రిప్లై ఇస్తున్నారు.

ఈ విషయంపై ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. సామాజిక వేత్తలు మాట్లాడుతూ 'భారతీయ సమాజంలో అమ్మాయిలను తక్కువ చేసి మాట్లాడుతారు. కూతరును పరాయి ఆస్తిగా భావించి అలాంటి మాటలు మాట్లాడుతారు అసలు అమ్మాయిని దానం ఇవ్వడానికి ఆమె ఒక వస్తువా..? ఇలాంటి మాటలు అమ్మాయిలు మనసును కలచి వేస్తాయి కదా..? మీకు మీ అమ్మాయి మీద ప్రేమ ఉన్నప్పటికీ లోలోపల అమ్మాయిన వేరే ఇంటికి తొందరగా పంపాలన్నా నిర్లిప్తత ఉంటుంది. అందువల్ల ఆమెను ఇతరులకు దానం చేస్తున్నట్లు ఫీలవుతారు' అని అన్నారు.

మరికొందరు మాట్లాడుతూ 'ఒక అమ్మాయి వివాహంలో కన్యాదానం చేయడం అంటే ఆ అమ్మాయి గుర్తింపు తగ్గించినట్లే అవుతుంది. ఇలాంటి ఆచారంతో అమ్మాయి గుర్తింపు తగ్గించేస్తున్నారు. సమాజంలో పాతుకుపోయిన పాత విశ్వాసాలకు అర్థంగా ఇది నిలుస్తుంది. అమ్మాయిని దానం ఇవ్వడానికి ఆమెకంటే మీరు ఎక్కువా..? లేక ఆమెకు మీరు పూర్తి యజమానా..? ' అన్న చర్చ సాగుతోంది.

అడ్వర్డయిజింగ్ స్టాండర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కన్సల్టెంట్ సభ్యురాలు మాట్లాడుతూ 'అమ్మాయిలను ఒకప్పుడు వస్తువులాగానే చూశారు. అయితే ప్రస్తుత సమాజంలో అమ్మాయి మనస్తత్వం మారింది. ఇటీవల ఓ ఆభరణాల యాడ్లో అమ్మాయిని రకరకాల మతాల్లో ఉండే వధూ వరులను చూపించారు. ముస్లింల సాంప్రదయాల్లో జరిగే శ్రీమంతాన్ని చూపించారు. అయితే అది వివాదాస్పదం కావడంతో దానిని తొలగించారు. ఒక విధంగా భారతీయ కుటుంబంలో అమ్మాయిపై హక్కు, అధికారం తండ్రి, సోదరుడి తరువాత భర్తకే హక్కు ఉంటుంది. కొన్ని అడ్వర్టయిజ్మెంట్లు ఇలాంటి సాంప్రదాయాలను ధిక్కించినట్లవుతాయి.' అని తెలిపింది.