Begin typing your search above and press return to search.

విదేశాలు మన కరోనా మందు కోసం ఎందుకు ఎగబడుతున్నాయి?

By:  Tupaki Desk   |   9 April 2020 6:30 PM GMT
విదేశాలు మన కరోనా మందు కోసం ఎందుకు ఎగబడుతున్నాయి?
X
కరోనాతో ప్రపంచమంతా అల్లకల్లోలం అవుతోంది. భారత్ లో మాత్రం పెద్దగా కేసులు లేవు.. మరణాలు లేవు. ఎందుకిలా అంటే.. మన వైద్యం, మందులు, చికిత్స విదేశాల కంటే మెరుగ్గా ఉండడమే. ఇక ఇమ్యూనిటీ పవర్ పెంచి కరోనాను నయం చేయడంలో భారతీయ వైద్యులు గొప్ప విజయం సాధిస్తున్నారు. అందుకే ఇప్పుడు భారత్ వాడుతున్న కరోనా మందుల కోసం, భారత్ లో తయారయ్యే కరోనా వ్యాధికి ఉపయోగించే మందుల కోసం విదేశాలన్నీ క్యూ కడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం క్లోర్లోక్విన్ మందు పంపించాలంటూ భారత్ ను బెదిరిస్తున్నారు.. బుజ్జగిస్తున్నారు.

ఇప్పుడు కరోనా చికిత్సలో ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోంది. కరోనాను ఎదుర్కోవడంలో భారతదేశం యొక్క సహకారాన్ని అందరూ కోరుతున్నారు.. అగ్రరాజ్యం అమెరికా కూడా సహాయం కోసం భారతదేశాన్ని అభ్యర్థిస్తుండడం విశేషంగా మారింది.

దీనికి అసలు కారణం ఏంటంటే.. భారతదేశం ప్రపంచంలోనే మలేరియా నియంత్రణ ఔషధమైన ‘హైడ్రాక్సిల్ క్లోరోక్విన్‌’ను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసే దేశం. ఈ మందు కావాలని ప్రపంచదేశాలన్ని భారత్ ను వేయినోళ్ల కోరుతున్నాయి. వాస్తవానికి, మలేరియా నిరోధక ఔషధాన్ని ప్రపంచంలోనే అతి ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం భారత్ మాత్రమే.. భారతదేశం ఎందుకు అతిపెద్ద ఉత్పత్తిదారు? అంటే భారత్ లో ఈ ఔషధం తయారీకి విదేశాలతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చు అవుతుంది. అందుకే చౌకగా లభిస్తుంది. ప్రొడక్షన్ ఖర్చు కూడా తక్కువే. ఔషధ ఉత్పత్తిదారులకు లాభాలు పెద్దగా రావు. కానీ, ఇప్పుడు కరోనాకు ఇదే మందు కావడం తో భారతదేశం లో ఈ మలేరియా నియంత్రణ కోసం పెద్ద మొత్తంలో డ్రగ్ ను ఉత్పత్తి చేస్తున్నారు. అన్ని ప్రధాన దేశాలు ఇప్పుడు ఈ ఔషధం కోసం భారత్ ను శరణు వేడుతున్నాయి. ఇటలీ - అమెరికా మరియు ఇతర దేశాలు భారతదేశం ఈ మందుపై నిషేధం ఎత్తి వేయాలని విన్నవిస్తున్నాయి. తమకు సరఫరా చేయాలని కోరుతున్నాయి.

భారతదేశం ప్రతి నెలా 4 టన్నుల హైడ్రాక్సిల్ క్లోరోక్విన్ ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు ఉత్పత్తిని నెలకు 10 టన్నులకు పెంచారు. కాబట్టి, మన దేశ స్థానిక ఉపయోగాలకు సరిపోనూ.. మిగతా ఎగుమతికి తగినంత ఎక్కువగా ఉత్పత్తి చేస్తోంది. దీంతో మన దేశ అవసరాలేకాదు.. ఇప్పుడు ప్రపంచ దేశాలను కరోనా రోగం నుంచి రక్షించే బాధ్యతను మన ఫార్మా రంగం అందిపుచ్చుకోవడం విశేషంగా మారింది.