భూమా కుటుంబానికి దిక్కెవరు ?

Sat Jul 31 2021 12:46:33 GMT+0530 (IST)

Tdp ex minister Bhuma Akhilapriya Comments

కర్నూలు జిల్లాలోని చాగలమర్రి సమావేశంలో మాజీమంత్రి భూమా అఖిలప్రియ ఇచ్చిన హామీ తెలుగుదేశం పార్టీలో వైరల్ గా మారింది. కార్యకర్తల సమావేశంలో అఖిల మాట్లాడుతు కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తమ కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని పెద్ద భరోసా ఇచ్చేశారు. కార్యకర్తలకు అండగా తమ కుటుంబం ఉండటం కాదు అసలు భూమా కుటుంబానికి అండగా ఎవరున్నారన్నదే అర్ధం కావటంలేదంటు సోషలమీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.ఒకపుడు భూమా కుటుంబం అంటే జిల్లాలో గట్టి ఫోర్సనే చెప్పాలి. అలాంటిది ముందు  భూమా శోభానాగిరెడ్డి తర్వాత భూమా నాగిరెడ్డి మరణించారు. దాంతో తల్లి నియోజకవర్గమైన ఆళ్ళగడ్డలో అఖిల పోటీచేసి గెలిచారు. చిన్న వయసులో గెలవటమే కాకుండా ఏకంగా మంత్రికూడా అయిపోయారు. ఎంత స్పీడుగా ఎంఎల్ఏగాను మంత్రిగాను ఎదిగారో అంతే స్పీడుగా ఎంఎల్ఏగా ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమిలో భాగంగానే చాలామంది ఓడినట్లే అఖిల కూడా ఓడిపోయారు.

మంత్రిగా ఉన్నపుడే అఖిల నోటిదురుసు వల్ల చాలామంది సీనియర్ నేతలు ఆమెకు దూరమైపోయారు. గట్టిగా చెప్పాలంటే పార్టీలో చాలాకాలంగా భూమా కుటుంబాన్ని పార్టీలోని నేతల్లో చాలామంది పట్టించుకోవటంలేదు. ఇక ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత భూమా కుటుంబం చాలా వివాదాల్లో కూరుకుపోయింది. కిడ్నాపులు బెదిరింపులు సంతకాల పోర్జరీ దాడులు హత్యలకు కుట్రల్లాంటి అనేక కేసుల్లో అఖిల+ఆమె భర్త+తమ్ముడు కేసులు ఎదుర్కొంటున్నారు.

భూమా కుటుంబం వివాదాల్లో కూరుకుపోతుండటంతో పార్టీ కూడా దూరం పెట్టేసింది. బెయిల్ మీద బయటకు వచ్చిన అఖిల ఎంత ప్రయత్నించినా చంద్రబాబునాయుడు అపాయిట్మెంట్ కూడా ఇవ్వలేదు. కనీసం ఫోన్లో కూడా మాట్లాడేందుకు ఇష్టపడలేదని సమాచారం. జెయిల్ నుండి బయటకు వచ్చిన అఖిలను జిల్లాలోని నేతల్లో చాలామంది కనీసం పలకరించనుకూడా లేదట. ఇక అప్పటివరకు మద్దతుదారులుగా ఉన్న మండల కేంద్రం నేతలు కూడా దూరమైపోయారట.

భూమా కుటుంబంతో ఉంటే తమపైన కూడా ఎక్కడ కేసులు పడతాయో అన్న భయంతోనే భూమా కుటుంబాన్ని వదిలేశారట. క్షేత్రస్ధాయి పరిస్ధితుల ప్రకారం అన్నిరకాలుగాను భూమా కుటుంబం ఒంటరైపోయినట్లే. ఇలాంటి నేపధ్యంలో తమకు అండగా ఉండేవారు ఎవరాని చూడాల్సిన కుటుంబం కార్యకర్తలకు తాము అండగా ఉంటామని చెప్పటమే పెద్ద జోక్ గా పార్టీ నేతలు చెబుతున్నారు.  అఖిల ఫోన్ చేస్తే చాలామంది అసలు తీయటంలేదట. అందుకనే అఖిల తాజా వ్యాఖ్యలను పెద్ద జోక్ గా వైరల్ అవుతోంది.