Begin typing your search above and press return to search.

రెండోదో సరిగా ఏడవలేదు కానీ.. మూడో దానికి రెఢీనట..

By:  Tupaki Desk   |   18 April 2021 5:35 PM GMT
రెండోదో సరిగా ఏడవలేదు కానీ.. మూడో దానికి రెఢీనట..
X
కరోనా ధాటికి దేశంలో మరే రాష్ట్రం గురి కానంత దారుణమైన అనుభవాల్ని ఎదుర్కొంటోంది మహారాష్ట్ర. రాజకీయ కారణాలు.. సామాజిక అంశాలు.. మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం ఎలా ఉంటుందో అందరూ చూస్తున్నారు. దేశంలో రోజుకు 2.5లక్షల కరోనా కేసులు నమోదవుతుంటే.. 60-70 వేల కేసులు ఒక్క మహారాష్ట్రలోనే చోటు చేసుకుంటున్నాయి. మరే రాష్ట్రంలో లేనంత దారుణమైన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి.

దీనికి తోడు ఆక్సిజన్ తో పాటు.. రెమెడెసివర్ తో పాటు.. రానున్న రోజుల్లో మందుల కొరత ఎదురైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న మాట వినిపిస్తోంది. ఇలాంటివేళ.. రాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే సంచలన వ్యాఖ్య చేశారు. తమ రాష్ట్రంలో త్వరలోనే మూడో వేవ్ స్టార్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోందన్నారు. అయితే.. సెకండ్ వేవ్ తో పోలిస్తే థర్డ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉంటుందా? తక్కువగా ఉంటుందా? అన్నది మాత్రం తాము చెప్పలేమన్నారు.

కరోనాకు సంబంధించి రాష్ట్రంలో తాము తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని కోవిడ్ టాస్క్ ఫోర్సు సూచనల ప్రకారమే తీసుకుంటున్నామని.. రాజకీయం ఎంతమాత్రం లేదని చెబుతున్నారు. కరోనా కేసుల విషయంలో తాము లెక్కలు సరిగా చెప్పటం లేదని కొందరు అంటున్నారని.. అది నిజం కాదన్నారు. మూడో వేవ్ ను ఎదుర్కోవటానికి సన్నద్ధమవుతున్నట్లుగా చెప్పారు. సెకండ్ వేవ్ దెబ్బకే అతలాకుతలమైన వేళ.. మూడో వేవ్ కు సిద్ధమవుతున్నట్లుగా చెబుతున్నఆదిత్య ఠాక్రే మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. సెకండ్ వేవ్ కే దిక్కు లేదు.. మూడో వేవ్ కు రెఢీ కావటమా? చూస్తుంటే.. రానున్న రోజులు మరింత గడ్డు పరిస్థితులు ఎదురుకాక తప్పదన్న మాట వినిపిస్తోంది.