రెమిడెసివిర్ ఎప్పుడు తీసుకోవాలి? కేంద్రం మార్గదర్శకాలివే?

Sun May 16 2021 18:00:02 GMT+0530 (IST)

When should a remdesivir  be taken Does the center have guidelines

ప్రస్తుతం ఆస్పత్రుల్లో రెమిడెసివిర్ దందా జోరుగా సాగుతోంది. ఈ ఇంజెక్షన్ ఎక్కడా మెడికల్ షాపుల్లో దొరకడం లేదు. కరోనా బాధితులమీద రెమిడెసివిర్ ప్రభావంతంగా పనిచేస్తుందని .. మరణాల రేటును తగ్గిస్తుందని ప్రచారం సాగడంతో ఆ ఇంజెక్షన్ కు ఎక్కడ లేని డిమాండ్ పెరిగిపోయింది. దీంతో రూ. 3000 లకు అమ్మాల్సిన ఇంజెక్షన్.. బ్లాక్లో రూ. 50 వేలదాకా పలుకుతోంది. మరోవైపు చాలా ప్రైవేటు ఆస్పత్రుల్లో దీన్ని ఓ దందాగా మార్చేశాయి.ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ రెమిడెసివర్ వాడకంపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది.

ప్రస్తుతం చాలా చోట్ల హోం ఐసోలేషన్ లో ఉన్నవాళ్లకు కూడా రెమిడెసివిర్ ఇస్తున్నారు. అయితే కేంద్రం మాత్రం.. ఎట్టి పరిస్థితుల్లో హోం ఐసోలేషన్ లో ఉన్నవాళ్లకు రెమెడెసివర్ ఇవ్వకూడదని కేంద్రం స్పష్టం చేసింది.

‘హోం ఐసోలేషన్ లో తీసుకోవాల్సిన మందులు జాగ్రత్తలు’ అనే అంశంపై ఎయిమ్స్ డాక్టర్లు నీరజ్ నిశ్చల్ మనీష్‌లు శనివారం ఒక వెబినార్ లో మాట్లాడారు.

హోం ఐసోలేషన్ లో ఉన్న కరోనా బాధితులు రెమిడెసివిర్ ఇంజక్షన్ ను తీసుకోవద్దు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవాళ్లకు తరుచూ ఆక్సిజన్ స్థాయిలను లెక్కించాలి. 94కు తగ్గితే వెంటనే ఆసుపత్రిలో చేరాలి.

కొంతమందికి రాపిడ్ యాంటిజెన్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చినా.. కరోనా లక్షణాలు కనిపిస్తే ఆర్టీపీసీఆర్ టెస్టు చేయాలి. కరోనా లక్షణాలు ఎక్కువగా ఉండి ఆర్టీపీసీఆర్ టెస్ట్ లో నెగిటివ్ వస్తే .. మరోసారి వారికి అదే పరీక్షను చేయాలి.

డాక్టర్ల సూచన మేరకు ఐసోలేషన్లో ఉంచాలా? లేక ఆస్పత్రిలో చేర్పించాలా ? అన్న విషయం నిర్ధారించాలి. డాక్టర్ల సూచనమేరకు మందులు వాడాలి.

అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్లు వాడొద్దు. డాక్టర్ల సూచనమేరకే మందులను వాడాలి. హోం ఐసోలేషన్ లో ఉన్న కరోనా బాధితులు కచ్చితంగా ఎన్95 మాస్కులు ధరించాలి. వారితో పాటు అదే ఇంట్లో ఉన్నవాళ్లు సైతం ఎన్95 మాస్కును పెట్టుకోవాలి. డాక్టర్ల సూచనమేరకు ఆహారం మందులు వాడాలి. ఆక్సిజన్ లెవెల్ తగ్గినా.. నడిచినప్పుడు ఆయాసం అనిపించినా వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.