Begin typing your search above and press return to search.

రాహుల్ పీఎం అయితే దేశం పరిస్థితి ఏమిటి?

By:  Tupaki Desk   |   12 Feb 2019 6:39 AM GMT
రాహుల్ పీఎం అయితే దేశం పరిస్థితి ఏమిటి?
X
రాహుల్ పీఎం అవుతాడా? అయితే దేశం పరిస్థితి ఏమిటి? అనేది ఆసక్తిదాయకమైన చర్చ.మొన్నటి వరకూ రాహుల్ పప్పుగానే భావించే వాళ్లు చాలా మంది. దేశంలో మోడీ పాలనపై పెరిగిన వ్యతిరేకత - దేశంలో వివిధరాష్ట్రాల్లో బీజేపీ పాలన మీద ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో రాహుల్ గ్రాఫ్ పెరుగుతూ వస్తోంది. ఇటీవల రాజస్తాన్ - చత్తీస్ గడ్ - మధ్యప్రదేశ్ లలో కాంగ్రెస్ కు దక్కిన విజయం రాహుల్ కు చాలా ఊరటను ఇచ్చింది. ఈయనను నేతగా చేసింది. ఇదే ఊపులో రాహుల్ ను యూపీఏ తరఫున ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాడు డీఎంకే స్టాలిన్.

అయితే ఆ ప్రకటనను చాలా పార్టీలు వ్యతిరేకించాయి. బీజేపీ వ్యతిరేక పార్టీలే అలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఎస్పీ - బీఎస్పీ - టీఎంసీ వంటి పార్టీలు రాహుల్ ప్రధానమంత్రి అభ్యర్థిత్వాన్ని సమర్థిచడం లేదు.

ఇప్పటి వరకూ రాహుల్ ను అవి నాయకుడిగా గుర్తించడం లేదు. అయితే బీజేపీ వ్యతిరేక పార్టీలుగా.. ఒక వేదిక మీద కలుస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ ప్రధాని అవుతాడని ఖాయంగా చెప్పలేని పరిస్థితి.

అయితే కాంగ్రెస్ లోకి ప్రియాంక ఇప్పుడు ఎంట్రీ ఇచ్చింది. రోడ్ షోలు మొదలుపెట్టింది. ఇలాంటి నేపథ్యంలో.. కొత్త ఊపు వస్తుందని కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు. అయితే కాంగ్రెస్ కనీసం సొంతంగా నూటా యాభై సీట్లను నెగ్గితే తప్ప రాహుల్ కు ప్రధానమంత్రి యోగం ఉండే అవకాశాలు లేవు.

కాంగ్రెస్ వంద మార్కును దాటడమే గగనంగా కనిపిస్తోంది. అద్భుతం జరిగి కాంగ్రెస్ పార్టీ నూటా యాభై సీట్లను దాటితే రాహుల్ ప్రధానమంత్రి అయిపోయినట్టే.

అయితే రాహుల్ నాయకత్వంలో దేశం పురోగమనిస్తుందా అనేది ప్రశ్నార్థకమే. రాహుల్ ఇప్పటి వరకూ ఎలాంటి చట్టబద్ధమైన పదవినీ చేపట్టలేదు. తనలో సత్తా ఉందని తన ప్రసంగాల ద్వారా అయినా నిరూపించుకోలేదు. కొన్ని రోజులు రాజకీయం చేయడం.. ఆ తర్వాత విరామాలు తీసుకోవడం.. ఇదీ రాహుల్ గాంధీ వ్యవహారం. రాజకీయాల పట్ల సీరియస్ నెస్ కనిపించడం లేదు. మరోవైపు ప్రియాంక ఎంట్రీతో రాహుల్ ప్రభ మరింత మసకబారుతోంది.