Begin typing your search above and press return to search.

పార్క్ హయత్ హోటల్ లో దొరికింది మల్లారెడ్డి మేనల్లుడా?

By:  Tupaki Desk   |   10 July 2020 4:45 AM GMT
పార్క్ హయత్ హోటల్ లో దొరికింది మల్లారెడ్డి మేనల్లుడా?
X
తెలంగాణ కేబినెట్ లో ఫుల్ జోష్, కామెడీతో సరదాగా ఉండే మంత్రి మల్లారెడ్డి అంటే అందరికీ అభిమానమే.. ఆయన కాలేజీ పార్టీల్లో స్టెప్పులేసినా.. మీడియా ముందట కామెడీ డైలాగులు పంచిన నవ్వకుండా ఉండలేరు.. ఇప్పటికే పలుసార్లు హాట్ కామెంట్స్ తో ఆయన వార్తల్లో నిలిచారు. ఈ మధ్య బొత్తిగా మీడియాకు దూరంగా ఉంటూ కామ్ అయిపోయారు. కేసీఆర్ హెచ్చరించాడో ఏమో కానీ సైలెంట్ అయిపోయాడు.

అయితే ఆయన సైలెంట్ గా ఉన్న ఆయన బంధుగణం మాత్రం పాపం మాల్లారెడ్డిని ఇరుకునపెడుతూనే ఉందట.. తాజాగా హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో నలుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు రేవ్ పార్టీ చేసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డ సంగతి తెలిసిందే.

అసలే కరోనా సమయంలో వైరస్ ఇంత తీవ్రంగా వ్యాపిస్తున్నందున ఇలాంటి పార్టీలకు ఎక్కడా అనుమతి లేదు. వీరు కూడా అనుమతి లేకుండా పార్క్ హయత్ హోటల్ లో పార్టీ చేసుకున్నారట. మామూలు టైంలోనే ఇలాంటి రేవ్ పార్టీకి అనుమతులు ఉండవు. అలాంటి ఇలాంటి డిజాస్టర్ టైంలో ఇంకా కఠిన ఆంక్షలుంటాయి. దీంతో పోలీసులు సీరియస్ అయ్యి వైరస్ ప్రబలే చాన్స్ ఉంటుందని వారిని అరెస్ట్ చేసి డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద కేసులు పెట్టారు.

అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే అరెస్ట్ అయిన వారిలో మంత్రి మల్లారెడ్డికి స్వయాన మేనల్లుడు ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతటి క్లిష్ట సమయంలో ఇలా మంత్రి మేనల్లుడు హోటల్ లో దొరకాడనే వార్త మంత్రి మల్లారెడ్డికి మింగుడుపడడం లేదనే ప్రచారం సాగుతోంది. నిజంగానే అల్లుడు దొరికాడా లేదా అధికారికంగా తెలియకపోయినా ఈ వార్త వెలుగులోకి రావడంతో మల్లారెడ్డి ఇరుకునపడిపోయాడు.

ఇప్పటికే కరోనాతో సవాలక్ష సమస్యలతో ఉన్న నేపథ్యంలో ఇంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తులే ఇలాంటి చర్యలకు దిగడం కరెక్ట్ కాదనే భావన అందరిలో వ్యక్తమవుతోంది.నిజంగా మంత్రి మేనల్లుడని వార్తలు వస్తున్నాయి. అదే నిజమైతే మల్లారెడ్డికి అవమానం తప్పదు. మరి ఈ కేసులో నిజానిజాలు బయటకు వస్తే పోలీసులు ఎలా ముందుకెళ్తారన్నది ఆసక్తిగా మారింది.